తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి మార్గదర్శకాలు

ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డులో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం

Advertisement
Update:2025-01-13 20:57 IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ-ఆహార భద్రత (రేషన్‌) కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనున్నది. దరఖాస్తులను నిశీతంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్‌ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు.

మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్‌ కమిషనర్‌ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డులో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం లభించనున్నది. ఆహారభద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నది.

Tags:    
Advertisement

Similar News