సచిన్ కు అరుదైన గౌరవం

మాస్టర్ కు ఎట్టకేలకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్  హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత ఆరో క్రికెటర్ సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన దిగ్గజ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇచ్చే అరుదైన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం ఆలస్యంగానైనా మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు దక్కింది. 2019 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కార గ్రహీతలలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌతాఫ్రికా వెటరన్ ఫాస్ట్ బౌలర్ అలన్ డోనాల్డ్, మహిళల […]

Advertisement
Update:2019-07-19 04:00 IST
  • మాస్టర్ కు ఎట్టకేలకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్
  • హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత ఆరో క్రికెటర్ సచిన్

అంతర్జాతీయ క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన దిగ్గజ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇచ్చే అరుదైన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం ఆలస్యంగానైనా మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు దక్కింది.

2019 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కార గ్రహీతలలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌతాఫ్రికా వెటరన్ ఫాస్ట్ బౌలర్ అలన్ డోనాల్డ్, మహిళల విభాగంలో ఆస్ట్ర్లేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిట్జ్ ప్యాట్రిక్స్ ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు, 30 వేలకు పైగా పరుగులు సాధించిన ఒకేఒక్కడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ను.. ఆలస్యంగానైనా ఐసీసీ కరుణించి హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చడం ద్వారా తన గౌరవాన్ని పెంచుకోగలిగింది.

భారత ఆరో క్రికెటర్ సచిన్..

ఎనిమిది దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో వేలాదిమంది క్రికెటర్లు వచ్చివెళ్లినా…హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని సంపాదించిన క్రికెటర్లు.. ఆరుగురంటే ఆరుగురు మాత్రమే ఉన్నారు.

భారత మాజీ కెప్టెన్లు బిషిన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్ మాత్రమే ఉన్నారు. 2019 సంవత్సరానికి మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈ గౌరవం సంపాదించడం ద్వారా భారత ఆరో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భార్య అంజలి తో కలసి సచిన్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.

Tags:    
Advertisement

Similar News