చంద్రబాబూ.. మీరు మారాలి.. లేకుంటే 13కి పడిపోతారు

“అయ్యా చంద్రబాబు నాయుడు గారూ…. మీరు మారాలి… మీ ఆలోచనా విధానం మారాలి. ప్రజల పట్ల మీ వైఖరి మారాలి. ప్రభుత్వం పట్ల మీ ధోరణి మారాలి. మీరు మారకపోతే ఇప్పుడున్న 23 స్థానాలు సంఖ్య భవిష్యత్తులో 13 పడిపోతుంది” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి హితవు పలికారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా పలుమార్లు సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి […]

Advertisement
Update:2019-07-17 05:36 IST

“అయ్యా చంద్రబాబు నాయుడు గారూ…. మీరు మారాలి… మీ ఆలోచనా విధానం మారాలి. ప్రజల పట్ల మీ వైఖరి మారాలి. ప్రభుత్వం పట్ల మీ ధోరణి మారాలి. మీరు మారకపోతే ఇప్పుడున్న 23 స్థానాలు సంఖ్య భవిష్యత్తులో 13 పడిపోతుంది” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి హితవు పలికారు.

మంగళవారం శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా పలుమార్లు సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఆలోచనా ధోరణి మారకపోతే ఆయనను, తెలుగుదేశం పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మోసం చేస్తూనే గడిపారని, అమాయకులైన ప్రజలు దానిని గమనించి తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు మాత్రమే కట్టబెట్టారని సీఎం చెప్పారు. “చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలకు తన బండారం తెలిసిందనే విషయం చంద్రబాబు నాయుడుకి ఇంకా అర్థం కాలేదు” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి వయసు పెరుగుతోందని, అయితే అందుకు తగ్గట్లుగా ఆయన వ్యవహరించడం లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని, ఆ నైజాన్ని ఆయన వదలకపోతే రాజకీయాలలో మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.

ఆయన రాజకీయ జీవితంలో చంద్రబాబునాయుడు ఏనాడు వాస్తవాలను వెల్లడించలేదని, ప్రతి అంశాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాలు కోసమే వాడుకున్నారని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. “అందరినీ అన్నివేళలా మోసం చేయాలంటే కుదరదు చంద్రబాబు గారు. మోసాల గుట్టురట్టు అయిన నాడు మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News