భారత్-న్యూజిలాండ్ సెమీస్ లో అరుదైన ఘట్టం
జూనియర్ ప్రపంచకప్ లో కెప్టెన్లుగా కొహ్లీ, విలియమ్స్ సన్ సీనియర్ ప్రపంచకప్ లోనూ కొహ్లీ, విలియమ్స్ సన్ లే కెప్టెన్లు 2008 జూనియర్ ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలుపు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ తొలిసెమీఫైనల్లో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స్ సన్..11 ఏళ్ల సుదీర్ఘ విరామం […]
- జూనియర్ ప్రపంచకప్ లో కెప్టెన్లుగా కొహ్లీ, విలియమ్స్ సన్
- సీనియర్ ప్రపంచకప్ లోనూ కొహ్లీ, విలియమ్స్ సన్ లే కెప్టెన్లు
- 2008 జూనియర్ ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలుపు
మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ తొలిసెమీఫైనల్లో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది.
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స్ సన్..11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముఖాముఖీ సెమీస్ సమరానికి సై అంటున్నారు.
ఇద్దరూ ఇద్దరే…
జూనియర్ ప్రపంచకప్ సెమీస్ లో ఈ రెండుజట్లు తలపడిన సమయంలో ఇటు కొహ్లీ, ఇటు విలియమ్స్ సన్ కెప్టెన్లుగా వ్యవహరించారు. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్ లో భారత్ 3 వికెట్లతో న్యూజిలాండ్ ను అధిగమించింది. విరాట్ కొహ్లీ ఆల్ రౌండ్ షోతో భారత్ ఫైనల్స్ చేరడమే కాదు.. జూనియర్ ప్రపంచకప్ ను సైతం సొంతం చేసుకోగలిగింది.
అప్పటి భారత జూనియర్ జట్టులో సభ్యులుగా ఉన్న రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్ ఇద్దరూ ప్రస్తుత సీనియర్ జట్టు లో సభ్యులు కావడం విశేషం.
మరోవైపు…జూనియర్ ప్రపంచకప్ లో న్యూజిలాండ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన కేన్ విలియమ్స్ సన్ …ప్రస్తుత సీనియర్ ప్రపంచకప్ జట్టులో సైతం.. కివీస్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
పవర్ ఫుల్ భారత్ తో జరిగే సెమీస్ సమరంలో తనజట్టుకు విజయం అందించడం ద్వారా…జూనియర్ ప్రపంచకప్ సెమీస్ ఓటమికి బదులుతీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
మొత్తం మీద…జూనియర్, సీనియర్ ప్రపంచకప్ టోర్నీలలో తమతమ జాతీయ జట్లకు నాయకత్వం వహించే అరుదైన ఘనతను విరాట్ కొహ్లీ, కేన్ విలియమ్స్ సన్ సొంతం చేసుకోగలిగారు.