ఏపీలో కొత్త ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తీసుకొని వచ్చిన నూతన ఇసుక విధానం వల్ల ఆదాయం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్లిందనే భావనలో ప్రజలు ఉన్నారు. దీంతో కొత్త విధానంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి, బుగ్గన, అనిల్ కుమార్, బాలినేనితో పాటు సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం పాల్గొన్నారు. అప్పటి ఇసుక విధానం వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని.. కాబట్టి కొత్త విధానాన్ని […]

Advertisement
Update:2019-07-04 12:16 IST

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తీసుకొని వచ్చిన నూతన ఇసుక విధానం వల్ల ఆదాయం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్లిందనే భావనలో ప్రజలు ఉన్నారు. దీంతో కొత్త విధానంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో మంత్రులు సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి, బుగ్గన, అనిల్ కుమార్, బాలినేనితో పాటు సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం పాల్గొన్నారు.

అప్పటి ఇసుక విధానం వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని.. కాబట్టి కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి ప్రతీ పైసా రాష్ట్ర ఖజానాలో జమయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు.

ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలతో నూతన విధానంపై కొంత అధ్యయనం చేశారు. ఈ వివరాలను మంత్రులు, అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. దీనిపై సమీక్షలో కూలంకషంగా చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News