అబ్బా... ఏమి సేయిస్తిరి... ఏమి సేయిస్తిరి.... " ట్విట్టర్‌లో విజయసాయి

“తెలుగుదేశం పార్టీ కొత్త నాటకాలకు తెరతీస్తోంది. కొందరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారిని చంద్రబాబు నాయుడి ఇంటికి పంపించి భలేగా నటింపజేస్తున్నారు. వారి నటన చూసిన వారంతా ఇంత నటన ఏమి సేయిస్తిరి.. ఏమి సేయిస్తిరి” అంటూ తెగ మెచ్చుకుంటున్నారు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పార్లెమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న సమయంలో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు రైతుల ముసుగులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి […]

Advertisement
Update:2019-07-01 10:48 IST

“తెలుగుదేశం పార్టీ కొత్త నాటకాలకు తెరతీస్తోంది. కొందరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారిని చంద్రబాబు నాయుడి ఇంటికి పంపించి భలేగా నటింపజేస్తున్నారు. వారి నటన చూసిన వారంతా ఇంత నటన ఏమి సేయిస్తిరి.. ఏమి సేయిస్తిరి” అంటూ తెగ మెచ్చుకుంటున్నారు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పార్లెమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న సమయంలో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు రైతుల ముసుగులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంటికి వచ్చి ఆయన్ని తమ ఇంటిలో ఉండాలంటూ కోరడం పెద్ద నాటకాన్ని తలపిస్తోందని విజయసాయి రెడ్డి తన ట్విట్ లో పేర్కొన్నారు.

దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడికి ఇప్పుడు నిలువ నీడలేదనే బిల్డప్ తో మా ఇంటికి రండి… మా ఇంటికి రండి అంటూ కొందరు కార్యకర్తలు ఆహ్వానించే నాటకం బాగా రక్తి కట్టిస్తోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తూండడం తెలుగుదేశం నాయకులకు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడుకు మింగుడు పడడం లేదని అన్నారు. తనను ఓదార్చేందుకు రోజుకు మూడు వందల మందిని రైతుల ముసుగులో తన వద్దకు చంద్రబాబునాయుడు రప్పించుకుంటున్నారని, ఇది ఎవరి సలహాయో కాని నాటకం రక్తి కట్టించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక రాజధానిలో ఇటీవల అక్రమ నిర్మాణంగా గుర్తించి కూలగొట్టిన ప్రజావేదిక నిర్మాణానికి 50 లక్షలకు మించి ఖర్చు కాదని, అయితే గత ప్రభుత్వం మాత్రం దానికి అక్షరాల 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

” ప్రజా వేదిక రేకుల షెడ్డును మీ హెరిటేజ్ డబ్బులతో కట్టారా… అందుకే మీరు, మీ ముఠా సభ్యులు అంత బాధపడుతున్నారా..?” అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ను ప్రశ్నించారు.

రాజకీయ నాయకులు ఎన్నికలలో విజయం సాధించినా… ఓటమి పాలైనా ప్రజల మధ్యే ఉండాలనుకుంటారని, అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కాలు బయటపెట్టడం లేదని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News