వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ పై భారత్ దే పైచేయి

99 వన్డేల్లో 53 విజయాల భారత్  ఇంగ్లండ్ పై భారత్ విజయశాతం 56  ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై భారత్ 3-4 రికార్డు ప్రపంచకప్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టీమ్ భారత్ తో రెండో ర్యాంకర్ ఇంగ్లండ్ మరికాసేపట్లో ఢీ కొనబోతోంది. సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ ను ఇంగ్లండ్ ఓడించి […]

Advertisement
Update:2019-06-30 05:00 IST
  • 99 వన్డేల్లో 53 విజయాల భారత్
  • ఇంగ్లండ్ పై భారత్ విజయశాతం 56
  • ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై భారత్ 3-4 రికార్డు

ప్రపంచకప్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టీమ్ భారత్ తో రెండో ర్యాంకర్ ఇంగ్లండ్ మరికాసేపట్లో ఢీ కొనబోతోంది.

సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ ను ఇంగ్లండ్ ఓడించి తీరాల్సి ఉంది.

ఇంగ్లండ్ పై భారత్ దే పైచేయి…

వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత్ దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ రెండుజట్లూ 99 వన్డేల్లో ఢీ కొంటే…భారత్ 53 విజయాలతో 56 విజయశాతం నమోదు చేసింది.

ఇక…ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత్ కు 3-4 రికార్డు మాత్రమే ఉంది. 43 శాతం మాత్రమే విజయాలు ఉన్నాయి.

బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా ఆడిన నాలుగు వన్డేల్లో భారత్ 3 విజయాలతో 75 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఇంగ్లండ్ తో భారత్ ఆడిన గత 5 వన్డేల్లో 2 గెలుపుతో 40 శాతం విజయాలు సాధించింది.

ప్రపంచక్రికెట్ వన్డే ఫార్మాట్లో రెండు అగ్రశ్రేణిజట్లుగా ఉన్న ఈ దిగ్గజాల సమరం ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందన్నదే ఇక్కడి అసలుపాయింట్.

Tags:    
Advertisement

Similar News