నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ...!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. శుక్రవారం నాడు హైదరాబాదులోని ప్రగతిభవన్ లో వీరిద్దరి సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్య నేతలు భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. శుక్రవారం నాడు హైదరాబాదులోని ప్రగతిభవన్ లో వీరిద్దరి సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్య నేతలు భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ రెండు కార్యక్రమాలతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలలో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు చెందిన కొందరు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణ లోనే ఉండిపోయారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిల విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో జల వివాదాలు తారస్థాయికి చేరాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంతాలకు పోవడంతో జల వివాదాలు పరిష్కారం కాలేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనడంతో జల వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కు సంబంధించి నెలకొన్న సమస్యలపై కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చిస్తారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.