వీవీ వినాయక్‌కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బుధవారం నాడు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్‌కు షాక్ ఇచ్చింది. భవనానికి అనుమతి పొందిన వాటికి మించి అధికంగా ఫ్లోర్లు నిర్మిస్తుండటంతో వాటిని కూల్చి వేసింది. వివరాల్లోకి వెళితే… జీహెచ్ఎంసీ పరిధిలోని నార్సింగి ప్రాంతంలో పలు అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇదే ప్రాంతం వట్టినాగులపల్లి గౌలిదొడ్డి సర్వే నంబర్ 223లో వీవీ వినాయక్ రెండు అంతస్తుల భవనానికి అనుమతి పొందారు. కానీ ఆయన అక్కడ ఆరు […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బుధవారం నాడు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్‌కు షాక్ ఇచ్చింది. భవనానికి అనుమతి పొందిన వాటికి మించి అధికంగా ఫ్లోర్లు నిర్మిస్తుండటంతో వాటిని కూల్చి వేసింది.
వివరాల్లోకి వెళితే…
జీహెచ్ఎంసీ పరిధిలోని నార్సింగి ప్రాంతంలో పలు అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇదే ప్రాంతం వట్టినాగులపల్లి గౌలిదొడ్డి సర్వే నంబర్ 223లో వీవీ వినాయక్ రెండు అంతస్తుల భవనానికి అనుమతి పొందారు. కానీ ఆయన అక్కడ ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఇంతకు మునుపే మున్సిపల్ అధికారులు గుర్తించారు.
దీంతో నార్సింగి మున్సిపల్ కమిషనర్, మేనేజర్ నర్సింహులు ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. ఇదివరకే వీవీ వినాయక్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేశామని… అయినా ఆయన స్పందించకపోవడంతో భవనాన్ని కూల్చక తప్పలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా వెలుస్తున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నారు.