డైరెక్షన్ లేక... పరువు తీస్తున్న తమ్ముళ్లు...

రాజకీయాల్లో దేన్ని పట్టుకోవాలో.. దేన్ని వదిలేయాలో తెలిసివాడే నిలబడుతాడు. ఇప్పుడు ఈ విషయంలో టీడీపీ నేతలు గందరగోళంలో ఉన్నారు. ఓటమి షాక్ వల్ల కాబోలు… డైరెక్షన్ ఇచ్చే బాబు ఇక్కడ లేకపోవడం కావొచ్చు. పదేపదే పప్పులో కాలేస్తున్నారు. ప్రజావేదిక విషయంలో మోస్ట్ సీనియర్ యనమల నుంచి… ఎన్‌జీవో నేత నుంచి ఎమ్మెల్సీగా రూపాంతరం చెందిన అశోక్ బాబు వరకు పస లేని వ్యాఖ్యలు చేస్తూ మరింత నవ్వుల పాలవుతున్నారు. అక్రమ కట్టడాలు కూల్చే జగన్ ఒకవైపు… అక్రమ […]

Advertisement
Update:2019-06-25 05:58 IST

రాజకీయాల్లో దేన్ని పట్టుకోవాలో.. దేన్ని వదిలేయాలో తెలిసివాడే నిలబడుతాడు. ఇప్పుడు ఈ విషయంలో టీడీపీ నేతలు గందరగోళంలో ఉన్నారు. ఓటమి షాక్ వల్ల కాబోలు… డైరెక్షన్ ఇచ్చే బాబు ఇక్కడ లేకపోవడం కావొచ్చు. పదేపదే పప్పులో కాలేస్తున్నారు. ప్రజావేదిక విషయంలో మోస్ట్ సీనియర్ యనమల నుంచి… ఎన్‌జీవో నేత నుంచి ఎమ్మెల్సీగా రూపాంతరం చెందిన అశోక్ బాబు వరకు పస లేని వ్యాఖ్యలు చేస్తూ మరింత నవ్వుల పాలవుతున్నారు. అక్రమ కట్టడాలు కూల్చే జగన్ ఒకవైపు… అక్రమ కట్టడాలకు కాపు చేసే టీడీపీ నేతలు ఒకవైపు అన్నట్టుగా షో మారిపోయింది.

జగన్‌ ప్రజావేదికను కూల్చేస్తానని ప్రకటించగానే.. అంటే అవినీతి జరిగి ఉంటే అసెంబ్లీ, సచివాలయం కూడా కూల్చేస్తారా అని యనమల ప్రశ్నిస్తున్నారు. అనుమతులు తీసుకోలేదన్న కారణంతో ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చేస్తారా? అని నిలదీశారు.

ఇక్కడ యనమల అండ్ టీం గమనించాల్సింది ఏమిటంటే… ఇతర భవనాలకు అనుమతులు తీసుకోకపోయినా అవి సాధారణ భూముల్లో ఉంటాయి కాబట్టి రెగ్యులరైజ్ చేయవచ్చు. కానీ మీరు ప్రజావేదికను నదిలో కట్టేశారు. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ఏదో ఒకరోజు కృష్ణమ్మ కరకట్ట మీదున్న అక్రమ కొంపలన్నింటిని తనదైన శైలితో రెగ్యులరైజ్ చేస్తుంది. కాబట్టి ప్రజావేదిక కూల్చాల్సిందే అనేది కొందరి వాదన.

అవినీతి పోలవరంలో కూడా జరిగిందంటున్నారు కదా మరి దాన్ని కూడా కూల్చేస్తారా? అని యనమల అమాయకంగా ప్రశ్నించారు. ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందన్న కారణంతో కాదు దాన్ని కూల్చేస్తున్నది…. నదిలో కట్టారన్న ప్రధాన కారణంతోనే దాన్ని కూల్చేస్తున్నారు. కాబట్టి టీడీపీ నేతలు తేడా తెలిసినా ప్రజలకు ఆ తేడా అర్థం కాకుండా తికమక పెట్టాలని చూస్తున్నారు.

కూల్చాలంటే నోటీసులు ఇవ్వాలి అంటున్నారు. ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాబట్టి నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన అక్రమ కొంపల విషయంలో నోటీసులు ఇచ్చే పనిమొదలుపెట్టే అవకాశం ఉంది. కాకపోతే ఈ బడాబాబులంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కాలర్ ఎగరేయాలనుకుంటున్నారు. కోర్టులు కూడా కాస్త ప్రభుత్వానికి సహకరిస్తే కృష్ణమ్మ తన దారిలో గర్వంగా ముందుకు సాగుతుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News