సభా మర్యాదను పాటించని చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు కొత్త స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే తమ్మినేని సీతారామ్‌ ఎన్నికయ్యారు. ఆయనను తన సీటు నుంచి సభాపతి స్థానం వరకూ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దగ్గరుండి తీసుకు వెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం శాసనసభ సంప్రదాయాల ప్రకారం ఒక గౌరవం, ఒక విలువ. కానీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఆ విలువను పాటించలేదు. తన సీటు నుంచి కదలనేలేదు. తనకు బదులుగా అచ్చెంనాయుడిని పంపించాడు. చంద్రబాబు నాయుడు విలువల గురించి, సభా సంప్రదాయాల గురించి మాట్లాడడమే గానీ […]

Advertisement
Update:2019-06-13 06:18 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు కొత్త స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే తమ్మినేని సీతారామ్‌ ఎన్నికయ్యారు. ఆయనను తన సీటు నుంచి సభాపతి స్థానం వరకూ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దగ్గరుండి తీసుకు వెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం శాసనసభ సంప్రదాయాల ప్రకారం ఒక గౌరవం, ఒక విలువ. కానీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఆ విలువను పాటించలేదు. తన సీటు నుంచి కదలనేలేదు. తనకు బదులుగా అచ్చెంనాయుడిని పంపించాడు.

చంద్రబాబు నాయుడు విలువల గురించి, సభా సంప్రదాయాల గురించి మాట్లాడడమే గానీ పాటించడం తక్కువ. గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పీకర్ గా ఎన్నికైనప్పుడు కూడా చంద్రబాబు ఈ మర్యాదను పాటించలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి … కిరణ్‌ కుమార్ రెడ్డిని స్పీకర్‌ స్థానం దగ్గరకు సగౌరవంగా తీసుకొని వెళ్తుంటే… అప్పుడు కూడా చంద్రబాబు తన సీట్లోనుంచి లేచి వెళ్ళలేదు.

అప్పట్లో అది పెద్ద చర్చకు దారి తీసింది. అయితే కిరణ్‌ కుమార్ రెడ్డితో ఉన్న వ్యక్తిగత ద్వేషం వల్ల చంద్రబాబు అలాంటి సభా మర్యాదను పాటించలేదని కొందరు సర్ధిచెప్పారు. అయితే ఆ తరువాత కాలంలో చంద్రబాబు నాయుడు, కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయంగా గొప్ప రహస్య మిత్రులుగా మిగిలిపోయారు.

కానీ తమ్మినేని సీతారాంకు, చంద్రబాబుకు ఎలాంటి విభేదాలు గానీ, శత్రుత్వం గానీ లేదు. పైగా తమ్మినేని తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చిన వ్యక్తి. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం సభామర్యాదను పాటించకపోవడం ఆయన గౌరవానికే ఒక కళంకం.

కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఎన్నికైనప్పుడు ప్రతిపక నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం కోడెలను మర్యాదపూర్వకంగా స్పీకర్ స్థానం వరకూ తీసుకువెళ్ళి సభా మర్యాదను గౌరవించారు.

Tags:    
Advertisement

Similar News