ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం.... ఇవే నిర్ణయాలు
సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం ఇవాళ అమరావతిలో జరిగింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ ప్రకటించిన పలు నిర్ణయాలకు ఈ కేబినెట్‌లో ఆమోద ముద్ర వేశారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం కింద 12500 రూపాయల సాయం అమలు, వృద్ధాప్య పింఛన్లు 2250 రూపాయలకు పెంపు, ఆశా వర్కర్ల వేతనం 3వేల నుంచి 10వేలకు పెంపు వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ […]
సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం ఇవాళ అమరావతిలో జరిగింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ ప్రకటించిన పలు నిర్ణయాలకు ఈ కేబినెట్‌లో ఆమోద ముద్ర వేశారు.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం కింద 12500 రూపాయల సాయం అమలు, వృద్ధాప్య పింఛన్లు 2250 రూపాయలకు పెంపు, ఆశా వర్కర్ల వేతనం 3వేల నుంచి 10వేలకు పెంపు వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), పారిశుథ్య కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించిన నిర్ణయానికి కూడా ఆమోద ముద్ర పడింది. అంతే కాకుండా ఫణి తుఫాను పరిహారానికి సంబంధించి 53 కోట్ల చెల్లింపు అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను, హోంగార్డులకు దినసరి వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక కీలకమైన ఆర్టీసీ విలీనంపై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని వేయాలని నిర్ణయించారు. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆరోగ్యశ్రీ పథకాన్ని సమగ్రంగా, పారదర్శకంగా తీర్చిదిద్దడంతో పాటు 104, 108 సర్వీసులకు కొత్త వాహనాల కొనుగోలుపైనా చర్చ జరిగింది. వీటితో పాటు ఐదున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మరో 20 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.