ఎన్నికల్లో అది మన విజయమే....

పార్టీ స్థాపించి ఇంకా ఐదేళ్ళు కాకముందే మన పార్టీకి ఇన్ని లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారంటే…. అది మన విజయమేనని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జనసేనకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ పార్టీ ఒక తీర్మానం చేసింది. పవన్‌ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేనపార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారు. భీమవరం లోనూ, గాజువాక లోనూ తాను ఓడిపోవడానికి కారణం టైం లేకపోవడం వల్లేనని… ఏ నియోజకవర్గానికీ ఎక్కువ సమయం కేటాయించలేక అక్కడి […]

Advertisement
Update:2019-06-07 07:01 IST

పార్టీ స్థాపించి ఇంకా ఐదేళ్ళు కాకముందే మన పార్టీకి ఇన్ని లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారంటే…. అది మన విజయమేనని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జనసేనకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ పార్టీ ఒక తీర్మానం చేసింది. పవన్‌ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేనపార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారు.

భీమవరం లోనూ, గాజువాక లోనూ తాను ఓడిపోవడానికి కారణం టైం లేకపోవడం వల్లేనని… ఏ నియోజకవర్గానికీ ఎక్కువ సమయం కేటాయించలేక అక్కడి ప్రజలను కలుసుకోలేక పోయానని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

త్వరలో ఒక పక్షపత్రికను ప్రారంభించి తమ పార్టీ ప్రాణాళికలు, నిర్ణయాలు, పార్టీ భావజాలాన్ని ప్రజలకు వివరిస్తామని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News