జగన్ నిర్ణయాలకు బెంబేలెత్తుతున్న టీడీపీ మీడియా
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ గద్దెనెక్కగానే పచ్చమీడియాకు షాక్ తగిలింది. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు తాజాగా ఏపీ సమాచార శాఖ ఏపీలోని లీడింగ్ రెండు పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. ఇక తెలంగాణలోనూ ప్రకటనలు ఇచ్చింది. అయితే జగన్ పై మొన్నటి ఎన్నికల వేళ దుమ్మెత్తిపోసిన ఆ మీడియాకు మాత్రం ప్రకటనలు ఇవ్వకపోవడంతో సదురు టీడీపీ మీడియా షాక్ తిన్నది. తాజాగా జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏపీలోని అగ్ర మీడియా సంస్థ లైన […]
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ గద్దెనెక్కగానే పచ్చమీడియాకు షాక్ తగిలింది. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు తాజాగా ఏపీ సమాచార శాఖ ఏపీలోని లీడింగ్ రెండు పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. ఇక తెలంగాణలోనూ ప్రకటనలు ఇచ్చింది.
అయితే జగన్ పై మొన్నటి ఎన్నికల వేళ దుమ్మెత్తిపోసిన ఆ మీడియాకు మాత్రం ప్రకటనలు ఇవ్వకపోవడంతో సదురు టీడీపీ మీడియా షాక్ తిన్నది.
తాజాగా జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏపీలోని అగ్ర మీడియా సంస్థ లైన ఈనాడు, సాక్షిలకు ఏపీ సమాచార శాఖ ప్రకటనలు ఇచ్చింది.
అయితే అనూహ్యంగా మూడో స్థానంలో ఉండే ఆంధ్రజ్యోతి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు రాలేదు. ఇక తెలంగాణలోని నమస్తే తెలంగాణ దినపత్రికకు కూడా ఏపీ ప్రభుత్వ ప్రకటనలు రావడం విశేషం.
ఇలా అధికారం చేపట్టకముందే జగన్ సదురు టీడీపీ మీడియాకు షాకిచ్చారు. అయితే అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం చేయగానే జగన్ మూడు మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు.
అనవసరంగా ప్రభుత్వం పై బురద జల్లుతూ వార్తలు రాస్తే జ్యుడిషియల్ కమిషన్ ఎదుట విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇలా టీడీపీ అనుకూల మీడియా ముందరి కాళ్లకు బంధం వేసిన జగన్ మున్ముందు ప్రభుత్వ ప్రకటనలకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ ఆర్థికపరిస్థితి దృష్ట్యా కఠినంగా ఉండే అవకాశాలున్నాయి. ఆర్థికంగా ఆ టీడీపీ మీడియాకు కష్టమే. అయినా జగన్ ధీటుగా ముందుకెళ్తున్నారు. ఇక వార్తల్లోనూ, వ్యతిరేక వార్తలపై కూడా కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. సో పచ్చ మీడియా పారాహుషార్ అంటూ హెచ్చరికలు పంపుతున్నారు.