ఏటా 20% మద్యం షాపుల ఎత్తివేత!
వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేపడతామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా మద్యం దుకాణాలను దశలవారీగా ఎత్తివేసే దిశగా కొత్త పాలసీని తీసుకురావాలని తాజాగా యోచిస్తోంది. గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రెండేళ్లకు కొత్త మద్యం పాలసీని […]
వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేపడతామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితమే ప్రకటించారు.
ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా మద్యం దుకాణాలను దశలవారీగా ఎత్తివేసే దిశగా కొత్త పాలసీని తీసుకురావాలని తాజాగా యోచిస్తోంది. గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో రానున్న రెండేళ్లకు కొత్త మద్యం పాలసీని రూపొందించాల్సి ఉంది. దీనిపై ఎక్సైజ్ శాఖ ఎప్పటి నుంచో కసరత్తు ప్రారంభించినా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అంశాన్ని తెరపైకి తేవడంతో ఎలాంటి విధానం తీసుకొస్తారోనని అధికారులు ఎదురుచూస్తున్నారు.
జూలై నుంచి అమలులోకి రానున్న కొత్త పాలసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం పాపులున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే జనాభా ప్రకారం పట్టణాలు, గ్రామాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మద్యం షాపులన్నిటినీ ఒకేసారి రద్దు చేయకుండా క్రమంగా తగ్గించే విధంగా ప్రభుత్వ కసరత్తు ఉండనుంది.
ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో 100 శాతం మద్యం షాపులు ఎత్తివేసి.. మద్యపాన నిషేధం అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.