ఏపీలోని మిర్చి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్
క్వింటా మిర్చికి రూ. 11,781 ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ
Advertisement
ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ గుడ్‌న్యూస్ చెప్పింది. క్వింటా మిర్చికి రూ. 11,781 ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెలపాటు ఈ ఉత్వర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీంతోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చికి ధర ప్రకటించింది.
Advertisement