మోదీజీ ఏ క్యా హై జీ....
కాంగ్రెస్ అభ్యంతరాలు లేవనెత్తిన తొమ్మిది అంశాల మీద కేంద్ర ఎన్నికల సంఘం నరేంద్ర మోడీకి క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ, దీని మీద సోషల్ మీడియాలో పలువురు రకరకాల వ్యాఖ్యానాలతో ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ రకంగా ఈసీని ఓ ఆట ఆడుకుంటున్నారు. నిజానికి ఈసారి ఎన్నికలలో నాయకులు చేసినన్ని వివాదాస్పద వ్యాఖ్యానాలు గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయలేదని అంటున్నారు పరిశీలకులు. సరే ఈ విషయాలను పక్కకు పెడితే ఎన్నికల ముందు బీజేపీ వైఖరికి, ఇప్పుడున్న వైఖరికి చాలా తేడా […]
కాంగ్రెస్ అభ్యంతరాలు లేవనెత్తిన తొమ్మిది అంశాల మీద కేంద్ర ఎన్నికల సంఘం నరేంద్ర మోడీకి క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ, దీని మీద సోషల్ మీడియాలో పలువురు రకరకాల వ్యాఖ్యానాలతో ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ రకంగా ఈసీని ఓ ఆట ఆడుకుంటున్నారు.
నిజానికి ఈసారి ఎన్నికలలో నాయకులు చేసినన్ని వివాదాస్పద వ్యాఖ్యానాలు గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయలేదని అంటున్నారు పరిశీలకులు. సరే ఈ విషయాలను పక్కకు పెడితే ఎన్నికల ముందు బీజేపీ వైఖరికి, ఇప్పుడున్న వైఖరికి చాలా తేడా ఉందని చెబుతున్నారు.
మోడీ ప్రసంగాలలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఎన్నికలకు ముందు ట్రిపుల్ తలాక్ అంశం మీద మోడీ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇది చట్ట రూపం దాల్చినందున ముస్లిం మహిళలు మూకుమ్మడిగా తమకు ఓట్లు వేస్తారని భావించారని అంటున్నారు.
కానీ, అది అంత సులభం కాదని ఇటు మోడీకి, అటు పార్టీకి త్వరగానే అర్థమైందని చెబుతున్నారు. అందుకే మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ఈ అంశాన్ని అంతగా ప్రస్తావించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటు యూపీ ముఖ్యమంత్రి యోగీని కూడా ఇతర ప్రాంతాలలో ప్రచారానికి అంతగా ఉపయోగించడం లేదు. యూపీలో కమలదళం గట్టి పోటీయే ఎదుర్కుంటోందని అంటున్నారు.
ములాయం, మాయావతి కలిసిపోవడం బీజేపీకి మింగుడు పడడం లేదని చెబుతున్నారు. చిర్రుబుర్రులాడుతూ అయినా అక్కడ ఎస్పీ, బీఎస్పీ సఖ్యతతోనే ముందుకు సాగుతున్నాయని అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా అధిక స్థానాలలో విజయం సాధించేలా వ్యూహాలను రచిస్తోందని అంటున్నారు.
ఈ క్రమంలో మోడీ పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్స్ మీదనే ఆశలు పెట్టుకున్నారని, అందుకే తన ప్రచార సభలలో వాటినే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని అంటున్నారు. అక్కడక్కడా సంబంధంలేని విషయాల మీద కూడా మోడీ మాట్లాడుతున్నారు. బీహార్ లో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన గురించి మాట్లాడారు.
అయితే దీని వెనుక రాజకీయ దీర్ఘకాలిక వ్యూహం దాగి ఉందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. విచిత్రంగా ఈసారి బీజేపీ నేతల నోటి నుంచి అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రతిపాదన మాటలు కూడా అంతగా రావడం లేదు. అంటే వీటితో ఓట్లు రాలవని కమలనాథులు గమనించారా?!