నారాయణ.... నారాయణ....

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసి 11 రోజులు గడిచింది. ఓట్ల లెక్కింపునకు  సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ నేతల అంతరంగాలు క్రమక్రమంగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉన్న తమ కంటే వైసీపీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిందని కొందరు టీడీపీ నేతలు అంటుంటే, మరి కొందరు నేతలు అసలు మేం పంచిన డబ్బు ఓటర్లకు చేరలేదని, కిందిస్థాయి నాయకులే మింగేశారని వాపోతున్నారట. సాక్షాత్తూ సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి, ప్రస్తుత మంత్రివర్గంలో […]

Advertisement
Update:2019-04-23 04:33 IST

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసి 11 రోజులు గడిచింది. ఓట్ల లెక్కింపునకు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ నేతల అంతరంగాలు క్రమక్రమంగా బయటపడుతున్నాయి.

అధికారంలో ఉన్న తమ కంటే వైసీపీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిందని కొందరు టీడీపీ నేతలు అంటుంటే, మరి కొందరు నేతలు అసలు మేం పంచిన డబ్బు ఓటర్లకు చేరలేదని, కిందిస్థాయి నాయకులే మింగేశారని వాపోతున్నారట.

సాక్షాత్తూ సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి, ప్రస్తుత మంత్రివర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఒక నేతే తన సన్నిహితుల వద్ద ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దీన్ని బట్టి వారు తమ ఓటమిని అంగీకరించినట్టేనా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు మాట్లాడుతున్నారని పార్టీ వారే చెబుతున్నారు.

ఆంతరంగిక సంభాషణల్లో లోపాలను ఎత్తి చూపుతున్నారట. చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేరు. జూన్ ఎనిమిది వరకు మనదే అధికారం అని ఆయన పదే పదే అంటున్నారంటే, ఆ తరువాత ఉండదని వారు భావిస్తున్నట్టేనా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు మాటలు తెలుగు తమ్ముళ్లను నిరాశకు గురి చేస్తున్నాయంటున్నారు. మెల్ల మెల్లగా వారు కూడా టీడీపీకి ఓటమి తప్పకపోవచ్చనే నిర్ణయానికి వస్తున్నారని చెబుతున్నారు.

తాజా సర్వేలంటూ అక్కడక్కడా హడావుడి చేస్తున్నా తెలుగు తమ్ముళ్లలో మాత్రం మునుపటి హుషారు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. రాజధాని అమరావతిలో ఉన్న కొందరు టీడీపీ నేతలు తమనే విజయం వరించబోతోందంటూ అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యానాలు కూడా కార్యకర్తల్లో జోష్ ను నింపలేకపోతున్నాయని అంటున్నారు.

ఓటమి దిశగా వారు కూడా మానసికంగా సిద్ధమవుతున్నట్టుగానే ఉందంటున్నారు. ఐదేళ్ల పాటు అరాచకాలు సాగించిన నేతలకు మాత్రం గుబులు పట్టుకుందంటున్నారు. తాము అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అక్రమాలు, అరాచకాల మీద విచారణ జరిపిస్తామని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు కారణమని సమాచారం. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో నెల రోజులపాటు వేచి ఉండాల్సిందే.

Tags:    
Advertisement

Similar News