ఉగ్రవాది అనే అనుమానంతో తహాన్‌ ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

ఢిల్లీకి చెందిన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడిని హత్య చేసేందుకు జరిగిన కుట్రలో ప్రమేయం ఉందని హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న తహాన్‌ అనే యువకుడిని శనివారం ఉదయం ఎన్‌ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కుట్ర కేసులో అరెస్ట్‌ అయిన హైదరాబాద్‌ వాసి బాసిత్‌ ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక కింగ్స్‌ కాలనీలో అద్దెకు ఉంటున్న తహాన్‌ను అరెస్టు చేసి గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. ఉగ్రవాద కోణంలో ఎనిమిది మంది అనుమానితుల […]

Advertisement
Update:2019-04-20 05:54 IST

ఢిల్లీకి చెందిన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడిని హత్య చేసేందుకు జరిగిన కుట్రలో ప్రమేయం ఉందని హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న తహాన్‌ అనే యువకుడిని శనివారం ఉదయం ఎన్‌ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్య కుట్ర కేసులో అరెస్ట్‌ అయిన హైదరాబాద్‌ వాసి బాసిత్‌ ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక కింగ్స్‌ కాలనీలో అద్దెకు ఉంటున్న తహాన్‌ను అరెస్టు చేసి గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.

ఉగ్రవాద కోణంలో ఎనిమిది మంది అనుమానితుల ఇళ్ళలో నిన్న రాత్రి నుంచి ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు ఢిల్లీలో భారీ విద్వంసానికి కుట్ర చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News