బాంబు పేల్చిన బీజేపీ.... 'ప్రత్యేక హోదా అనేదే లేదు'

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులే సమయం ఉంది. మరి కొద్ది గంటల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు గత నాలుగేళ్లుగా పోట్లాడుకుంటున్న అంశం ‘ప్రత్యేక హోదా’. మొదట్లో ప్రత్యేక హోదా వద్దు… ప్యాకేజీనే ముద్దు… అని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. కాని వైసీపీ మాత్రం మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా […]

Advertisement
Update:2019-04-08 10:02 IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులే సమయం ఉంది. మరి కొద్ది గంటల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు గత నాలుగేళ్లుగా పోట్లాడుకుంటున్న అంశం ‘ప్రత్యేక హోదా’. మొదట్లో ప్రత్యేక హోదా వద్దు… ప్యాకేజీనే ముద్దు… అని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. కాని వైసీపీ మాత్రం మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతూ వచ్చింది.

ఇప్పుడు ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదానే ఇరు పార్టీలకు ప్రధాన ఎన్నికల అస్త్రంగా తయారయ్యింది. ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే నేను కేంద్రాన్ని ఒప్పిస్తానని వైసీపీ నేత జగన్ అంటున్నారు. మరో వైపు చంద్రబాబు కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిందని చెబుతున్నారు. బీజేపీ మాత్రం చంద్రబాబు ప్యాకేజీనే కావాలని అన్నాడని చెబుతోంది.

ఇలా ప్రత్యేక హోదా ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారిన తరుణంలో.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పెద్ద బాంబు పేల్చారు. అసలు కేంద్రం దృష్టిలో ప్రత్యేక హోదా అనే వ్యవస్థే లేదన్నారు. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడో అంతరించి పోయిందని.. ఇప్పుడు ప్రత్యేక లోటు వ్యవస్థ ఉందని చెప్పారు.

లోటు బడ్జెట్ ఉన్న ఏపీకి కేంద్రం 22,130 కోట్లు ఇచ్చిందని.. దీనితో పాటు 17,500 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి సమకూర్చిందని చెప్పారు. మరి ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా అన్న పార్టీలు దీనికి ఏం సమాధానం చెబుతాయో.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న బీజేపీ చివరి నిమిషంలో ఈ మాట ఎందుకు చెబుతోందో వాళ్లకే తెలియాలి..!

Tags:    
Advertisement

Similar News