రాజకీయాల్లో పులివేషగాడు పవన్‌.... ఇంత దిగజారిపోతారని ఊహించలేదు....

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంతగా దిగజారిపోతారని తాను ఊహించలేదన్నారు సీనియర్ నేత సీ. రామచంద్రయ్య. చంద్రబాబును తిరిగి అధికారంలోకి రప్పించేందుకు 2014 కంటే తీవ్రంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చివరకు పవన్‌ కల్యాణ్ తన సొంత అభిమానులను కూడా మోసం చేశారన్నారు. పవన్‌ కల్యాణ్ ముసుగువీరుడిగా అవతారమెత్తారన్నారు. చెగువేరా అంటూ పవన్‌ కల్యాణ్ మాట్లాడుతుంటే ఏదో చేస్తారనుకున్నానని.. కానీ ఆయన చంద్రబాబు కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. పవన్‌ కల్యాణ్ కంటే చిరంజీవే చాలా బెటర్ అని జనసేన అభిమానులే చెబుతున్నారన్నారు. […]

Advertisement
Update:2019-03-23 06:19 IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంతగా దిగజారిపోతారని తాను ఊహించలేదన్నారు సీనియర్ నేత సీ. రామచంద్రయ్య. చంద్రబాబును తిరిగి అధికారంలోకి రప్పించేందుకు 2014 కంటే తీవ్రంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చివరకు పవన్‌ కల్యాణ్ తన సొంత అభిమానులను కూడా మోసం చేశారన్నారు.

పవన్‌ కల్యాణ్ ముసుగువీరుడిగా అవతారమెత్తారన్నారు. చెగువేరా అంటూ పవన్‌ కల్యాణ్ మాట్లాడుతుంటే ఏదో చేస్తారనుకున్నానని.. కానీ ఆయన చంద్రబాబు కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా
అర్థమైపోయిందన్నారు. పవన్‌ కల్యాణ్ కంటే చిరంజీవే చాలా బెటర్ అని జనసేన అభిమానులే చెబుతున్నారన్నారు. హఠాత్తుగా తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు.

నారా లోకేష్‌పై జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టకపోవడం ద్వారానే పవన్ కల్యాణ్ ఎవరి మనిషో అర్థమైపోయిందన్నారు. పవన్‌ కల్యాణ్ రాజకీయాల్లో పులివేషాలేస్తున్నారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్ డూప్‌గా మారిపోయారన్నారు. అధికార పక్షాన్ని విమర్శించకుండా… ప్రతిపక్షాన్ని విమర్శించే విచిత్ర రాజకీయం పవన్‌ నడుపుతున్నారన్నారు.
పవన్‌ కల్యాణ్ ఒక మిస్టర్‌ కన్‌ఫ్యూజన్‌ అని సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.

రాయలసీమపై పవన్‌ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన పరిపక్వతలేని తనానికి నిదర్శనమన్నారు. పవన్‌ కల్యాణ్ కుటుంబ సభ్యులంతా, బంధువులంతా తెలంగాణలోనే ఉన్నారని… కానీ వారిని ఎవరైనా కొట్టారా? అని సి. రామచంద్రయ్య
ప్రశ్నించారు. తెలంగాణలో ప్రశాంతంగా బతుకుతున్న ఆంధ్ర ప్రజల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని సి. రామచంద్రయ్య మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News