గర్భందాల్చి పుట్టిన శిశువు

ఇదొక అరుదైన సంఘటన. వైద్య చరిత్రలో అరుదుగా సంభవించే ఇలాంటి సంఘటనల్లో పిల్లలు బతికే అవకాశం ఉండదు. కాని వైద్యులు అత్యంత చాకచక్యంగా శస్త్ర చికిత్స చేసి బతికించారు. వివరాల్లోకి వెళితే.. కొలంబియాకు చెందిన మోనికా వెగా అనే 33 ఏళ్ల స్త్రీ గర్భం దాల్చింది. తొలుత ఆరోగ్యంగానే ఉన్న మోనిక తరచూ వైద్య పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, కలర్ డాప్లర్ టెస్టు చేయించుకుంది. దాంట్లో ఆమె పిండం అసాధారణంగా […]

Advertisement
Update:2019-03-22 03:30 IST

ఇదొక అరుదైన సంఘటన. వైద్య చరిత్రలో అరుదుగా సంభవించే ఇలాంటి సంఘటనల్లో పిల్లలు బతికే అవకాశం ఉండదు. కాని వైద్యులు అత్యంత చాకచక్యంగా శస్త్ర చికిత్స చేసి బతికించారు. వివరాల్లోకి వెళితే..

కొలంబియాకు చెందిన మోనికా వెగా అనే 33 ఏళ్ల స్త్రీ గర్భం దాల్చింది. తొలుత ఆరోగ్యంగానే ఉన్న మోనిక తరచూ వైద్య పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, కలర్ డాప్లర్ టెస్టు చేయించుకుంది. దాంట్లో ఆమె పిండం అసాధారణంగా పెరిగినట్లు గుర్తించారు. ఆమె ఆరోగ్యానికి ప్రమాదమని గుర్తించి ప్రసవానికి ముందే సిజేరియన్ ద్వారా శిశువును బయటకు తీశారు.

అయితే ఆశ్చర్యకరంగా ఆ శిశువు గర్భంతో ఉంది. సాధారణంగా గర్భంలో రెండు పిండాలు ఏర్పడితే అవి వేర్వేరుగా ఎదిగి కవలలు పుట్టే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈమె విషయంలో ఒక పిండంలో మరో పిండం ఎదగడంతో పుట్టిన శిశువు గర్భంతో పుట్టింది. వైద్యులు వెంటనే చిన్నారి శిశువుకు శస్త్ర చికిత్స చేసి లోపలి పిండాన్ని తొలగించారు.

ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News