టెస్ట్ క్రికెట్ 142 ఏళ్ల చరిత్రలో సరికొత్త రికార్డు

అఫ్ఘనిస్థాన్ తో టెస్టులో ఐర్లాండ్ ఆటగాడి ఘనత టెస్ట్ రెండుఇన్నింగ్స్ లోనూ 25కు పైగా పరుగుల సాధించిన టిమ్ ముర్తాగ్ తొలిఇన్నింగ్స్ లో 54, రెండోఇన్నింగ్స్ లో 27 పరుగుల స్కోర్లు 142 ఏళ్ల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును క్రికెట్ పసికూన ఐర్లాండ్ టెయిల్ ఎండర్ టిమ్ ముర్తాగ్ నెలకొల్పాడు. డెహ్రాడూన్ వేదికగా అప్ఘనిస్థాన్ తో ముగిసిన సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో 11వ నంబర్ బ్యాట్స్ మన్ బ్యాటింగ్ కు […]

Advertisement
Update:2019-03-18 14:00 IST
  • అఫ్ఘనిస్థాన్ తో టెస్టులో ఐర్లాండ్ ఆటగాడి ఘనత
  • టెస్ట్ రెండుఇన్నింగ్స్ లోనూ 25కు పైగా పరుగుల సాధించిన టిమ్ ముర్తాగ్
  • తొలిఇన్నింగ్స్ లో 54, రెండోఇన్నింగ్స్ లో 27 పరుగుల స్కోర్లు

142 ఏళ్ల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును క్రికెట్ పసికూన ఐర్లాండ్ టెయిల్ ఎండర్ టిమ్ ముర్తాగ్ నెలకొల్పాడు.

డెహ్రాడూన్ వేదికగా అప్ఘనిస్థాన్ తో ముగిసిన సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో 11వ నంబర్ బ్యాట్స్ మన్ బ్యాటింగ్ కు దిగిన ముర్తాగ్ సాధించాడు.

ఐర్లాండ్ తొలిఇన్నింగ్స్ లో 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన ముర్తాగ్…రెండో ఇన్నింగ్స్ లో సైతం…జేమ్స్ కామెరూన్ తో కలసి 10వ వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందులో 27 పరుగులు సాధించాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 11వ నంబర్ ఆటగాడు మ్యాచ్ రెండుఇన్నింగ్స్ లోనూ 25 పరుగులకు పైగా స్కోర్లు సాధించడం ఇదే మొదటిసారి. ఆ ఘనతను పసికూన ఐర్లాండ్ 11వ నంబర్ వన్ ఆటగాడు టిమ్ ముర్తాగ్ నమోదు చేశాడు.

గత ఏడాదే ఐసీసీ నుంచి టెస్ట్ హోదా సంపాదించిన ఐర్లాండ్, అప్ఘనిస్థాన్…ఓ టెస్ట్ మ్యాచ్ లో ముఖాముఖీ తలపడటం ఇదే మొదటిసారి. మూడురోజుల్లోనే ముగిసిన ఈ ఐదురోజుల టెస్టులో ఐర్లాండ్ పై అప్ఘనిస్థాన్ విజయం సాధించింది.

Tags:    
Advertisement

Similar News