వాఘా బోర్డర్‌లో అభినందన్.... రిసీవ్ చేసుకునేది ఎవరో తెలుసా?

పాకిస్తాన్ చెర నుంచి విడుదల అవుతున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ కొద్ది సేపటి క్రితం వాఘా బోర్డర్‌కు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ, ప్రత్యేక కాన్వాయ్‌లో లాహోర్ నుంచి అభినందన్‌ ను పాకిస్తాన్ ప్రభుత్వం అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టుకు తరలించింది. అభినందన్‌కు అక్కడ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. అభినందన్‌ ను అధికారికంగా ఐఏఎఫ్‌కు అప్పగిస్తారు. వాయుసేనకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులు అభినందన్‌ను […]

Advertisement
Update:2019-03-01 11:38 IST

పాకిస్తాన్ చెర నుంచి విడుదల అవుతున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ కొద్ది సేపటి క్రితం వాఘా బోర్డర్‌కు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ, ప్రత్యేక కాన్వాయ్‌లో లాహోర్ నుంచి అభినందన్‌ ను పాకిస్తాన్ ప్రభుత్వం అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టుకు తరలించింది.

అభినందన్‌కు అక్కడ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.

అభినందన్‌ ను అధికారికంగా ఐఏఎఫ్‌కు అప్పగిస్తారు. వాయుసేనకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులు అభినందన్‌ను స్వీకరిస్తారు. ఎయిర్ వైస్ మార్షల్ రవి కపూర్‌, శ్రీకుమార్ ప్రభాకరన్ ఈ అధికారిక అప్పగింతలో పాల్గొంటారు. వీరితో పాటు ఐఏఎఫ్ టీం కూడా వాఘా సరిహద్దులో ఉంది.

అభినందన్ భారత్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఐఏఎఫ్ ప్రత్యేక బృందం ఆయనకు మరోసారి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయనుంది. ఏమైనా బగ్స్, చిప్స్ అభినందన్ శరీరంలో చొప్పించారా అనే విషయం కూడా క్షణ్ణంగా తనిఖీ చేయనున్నట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News