భారత్‌కు బాసటగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కీలక నిర్ణయం

పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌లో ఉగ్రదాడులకు సూత్రధారి అయిన జైషే ఏ మహ్మద్ చీఫ్ మసూద్‌ ఆజర్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందిస్తోంది. పుల్వామా దాడి, ఆ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైన మసూద్‌పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తీవ్రంగా స్పందించాయి. మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఐక్యరాజ్యసమితిని మూడు దేశాలు కోరాయి. మసూద్‌ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరాయి. మసూద్‌ అంతర్జాతీయ పర్యటన పైనా నిషేధం విధించాలని మూడు దేశాలు విజ్ఞప్తి చేశాయి. మసూద్ ఆస్తులను కూడా సీజ్ చేయాలని భద్రతా మండలి  […]

Advertisement
Update:2019-02-28 04:16 IST

పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌లో ఉగ్రదాడులకు సూత్రధారి అయిన జైషే ఏ మహ్మద్ చీఫ్ మసూద్‌ ఆజర్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందిస్తోంది. పుల్వామా దాడి, ఆ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైన మసూద్‌పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తీవ్రంగా స్పందించాయి.

మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఐక్యరాజ్యసమితిని మూడు దేశాలు కోరాయి. మసూద్‌ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరాయి. మసూద్‌ అంతర్జాతీయ పర్యటన పైనా నిషేధం విధించాలని మూడు దేశాలు విజ్ఞప్తి చేశాయి.

మసూద్ ఆస్తులను కూడా సీజ్ చేయాలని భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. దీనిపై 15 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మార్చి 13లోగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ డిమాండ్‌ లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చు.

గతంలోనూ మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలన్న డిమాండ్ వచ్చినప్పుడు చైనా తన వీటో హక్కుతో మోకాలడ్డింది. ఇప్పుడు మసూద్‌ అసలు రూపం ఏంటో పుల్వామా దాడి ద్వారా ప్రపంచానికి తెలిసిన నేపథ్యంలో ఉగ్రవాదికి చైనా మరోసారి సాయం చేస్తుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News