అభినందన్‌ ను రేపు విడుదల చేస్తాం....

పైలట్ అభినందన్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌ను బెదిరించాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రేపు అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తున్నట్టు పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పాక్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితులు తగ్గితేనే అభినందన్‌ను విడుదల చేస్తామని తొలుత పాక్ ప్రకటించింది. అయితే భారత్‌ మాత్రం పాక్‌ ఎత్తుకు తీవ్రంగా స్పందించింది. అభినందన్‌ను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని… అభినందన్‌ విడుదల కోసం పాక్‌తో చర్చలు, సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అభినందన్‌ను విడుదల చేయని పక్షంలో తాము […]

Advertisement
Update:2019-02-28 12:20 IST

పైలట్ అభినందన్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌ను బెదిరించాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రేపు అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తున్నట్టు పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పాక్ పార్లమెంట్‌లో ప్రకటించారు.

ఉద్రిక్త పరిస్థితులు తగ్గితేనే అభినందన్‌ను విడుదల చేస్తామని తొలుత పాక్ ప్రకటించింది. అయితే భారత్‌ మాత్రం పాక్‌ ఎత్తుకు తీవ్రంగా స్పందించింది. అభినందన్‌ను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని… అభినందన్‌ విడుదల కోసం పాక్‌తో చర్చలు, సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

అభినందన్‌ను విడుదల చేయని పక్షంలో తాము చేయాల్సింది చేస్తామని భారత్ స్పష్టం చేసింది. కాందహార్ విమాన హైజాక్ సమయంలో లాగా ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా లేవని స్పష్టంగా తేల్చిచెప్పింది భారత్.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ వెనుక ఉన్నందున పాక్‌ భయానికి లోనయింది. ఈ నేపథ్యంలో అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. తాను నిన్న భారత ప్రధాని మోడీతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించినట్టు ఇమ్రాన్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News