యూఎస్‌లో విద్యార్థి ఆకుతోట విశ్వనాథ్ అరెస్ట్.... ఏం చేశాడో తెలుసా....
అమెరికాలో భారత విద్యార్థి ఆకుతోట విశ్వనాథ్ అరెస్ట్ అయ్యాడు. కాలేజీ ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకుతోట విశ్వనాథ్ ఉద్దేశపూర్వకంగా కాలేజీలో 50 కంప్యూటర్లను నాశనం చేసినట్టు అభియోగం. ఈనెల 14న విద్యార్థిపై సెయింట్ రోజ్ కాలేజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశ్వనాథ్ కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం వల్ల 50వేల డాలర్ల మేర నష్టం జరిగిందని కాలేజీ చెబుతోంది. విశ్వనాథ్ ప్రస్తుతం విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. నార్త్ కరోలినాలోని రాలీగ్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే ఆకుతోట విశ్వనాథ్‌కు 10ఏళ్ల […]
అమెరికాలో భారత విద్యార్థి ఆకుతోట విశ్వనాథ్ అరెస్ట్ అయ్యాడు. కాలేజీ ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకుతోట విశ్వనాథ్ ఉద్దేశపూర్వకంగా కాలేజీలో 50 కంప్యూటర్లను నాశనం చేసినట్టు అభియోగం. ఈనెల 14న విద్యార్థిపై సెయింట్ రోజ్ కాలేజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విశ్వనాథ్ కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం వల్ల 50వేల డాలర్ల మేర నష్టం జరిగిందని కాలేజీ చెబుతోంది. విశ్వనాథ్ ప్రస్తుతం విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. నార్త్ కరోలినాలోని రాలీగ్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే ఆకుతోట విశ్వనాథ్‌కు 10ఏళ్ల జైలు, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.