భారత వైమానిక దాడులపై పాక్ ప్రకటన

మోడీ అన్నంత పని చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని… దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతామన్నట్టుగానే పాక్‌పై భారత వైమానిక దళం విరుచుకుపడింది. ప్రధాని ఆదేశాలపై తెల్లవారుజామున మూడున్నర సమయంలో భారత్‌ వైమానిక దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాల వైపు దూసుకెళ్లాయి. జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలు టార్గెట్‌గా భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భావిస్తున్నారు. దాడిలో జైషే ఏ మహ్మద్ ఉగ్రవాద కంట్రోల్ సెంటర్ ధ్వంసమైంది. ఈదాడిని పాకిస్థాన్ కూడా ధృవీకరించింది. […]

Advertisement
Update:2019-02-26 04:29 IST

మోడీ అన్నంత పని చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని… దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతామన్నట్టుగానే పాక్‌పై భారత వైమానిక దళం విరుచుకుపడింది.

ప్రధాని ఆదేశాలపై తెల్లవారుజామున మూడున్నర సమయంలో భారత్‌ వైమానిక దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాల వైపు దూసుకెళ్లాయి.

జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలు టార్గెట్‌గా భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో దాదాపు 300
మంది ఉగ్రవాదులు హతమైనట్టు భావిస్తున్నారు. దాడిలో జైషే ఏ మహ్మద్ ఉగ్రవాద కంట్రోల్ సెంటర్ ధ్వంసమైంది.

ఈదాడిని పాకిస్థాన్ కూడా ధృవీకరించింది. భారత్ యుద్ధ విమానాలు లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ను దాటాయని వెల్లడించింది. అయితే భారత్‌ యుద్ద విమానాలను తమ జెట్‌ ఫైటర్స్ తిప్పికొట్టాయని పాక్ చెప్పుకుంది.

Tags:    
Advertisement

Similar News