మంచులో కూరుకొని పోయిన కుక్కను రక్షించారు.... ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

గడ్డకట్టుకొని పోయిన ఒక నది మంచులో కూరుకొని ఉన్న కుక్కను చూసి ఆ దగ్గరే పని చేస్తున్న నిర్మాణ కార్మికులు దాన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అది కుక్క కాదు తోడేలు అని చెప్పే సరికి ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూరోప్‌లోని ఉత్తర ప్రాంతంలో ఎస్టోనియా అనే దేశంలో పార్ను నది మీద సింది కౌంటీలో ఒక డ్యాం నిర్మాణం చేస్తున్నారు. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో నదులు తరచు […]

Advertisement
Update:2019-02-26 02:15 IST

గడ్డకట్టుకొని పోయిన ఒక నది మంచులో కూరుకొని ఉన్న కుక్కను చూసి ఆ దగ్గరే పని చేస్తున్న నిర్మాణ కార్మికులు దాన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అది కుక్క కాదు తోడేలు అని చెప్పే సరికి ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూరోప్‌లోని ఉత్తర ప్రాంతంలో ఎస్టోనియా అనే దేశంలో పార్ను నది మీద సింది కౌంటీలో ఒక డ్యాం నిర్మాణం చేస్తున్నారు. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో నదులు తరచు గడ్డకడుతుంటాయి. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆ నదిని దాటుతున్న ఒక తోడేలు మంచులో కూరుకొని పోయింది. దీన్ని గమనించిన నిర్మాణ కార్మికులు వెంటనే దాన్ని దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు ఇది కుక్కకాదని తోడేలని చెప్పడంతో కార్మికులు అవాక్కయ్యారు. మంచులో కూరుకొని పోయి బలహీనంగా మారిన ఆ తోడేలుకు వైద్యులు జాగ్రత్తగా వైద్యం చేశారు. బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో అది మౌనంగా ఉండిపోయిందని.. కోలుకుంటే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో దాన్ని ఒక బోనులో ఉంచారు.

ఈ తోడేలును రక్షించిన వారిలో ఒకరైన రాండో అనే వ్యక్తి మాట్లాడుతూ.. మంచు నుంచి కుక్క అనుకొని రక్షించాము. అంతా జారుడుగా ఉండటంతో దాన్ని భుజాలపై మోసాను. బయటకు తీసుకొని వచ్చాక కాళ్లు బిగుసుకొని పోయి ఉండటంతో కాస్త సరి చేయడానికి ప్రయత్నిస్తే అది నా వైపు ఒక్కసారిగా చూసింది. ఆ తర్వాత ఒడిలో కూర్చోబెట్టుకొనే ఆసుపత్రికి తీసుకొని వచ్చానని చెప్పాడు. ఇప్పుడు అది తోడేలని తలచుకుంటే కాస్త భయంగా ఉంది. కాని అది నన్నేమీ చేయలేదని చెప్పాడు.

తోడేలు పూర్తిగా కోలుకున్నాక దాని కాలర్‌కు ఒక జీపీఎస్ పరికరాన్ని అమర్చి దగ్గరలోని వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో వదిలేశారు. దాన్ని రక్షించిన కార్మికులు, డాక్టర్లపై ఆ దేశంలో ప్రశంసల జల్లుకురుస్తోంది.

ఎస్టోనియా దేశంలో 200 తోడేళ్లు మాత్రమే ఉండటంతో వాటిని రక్షంచే ఉద్దేశంతో 2018లో దానిని జాతీయ జంతువుగా ప్రకటించారు. ఈ ఘటన మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

"SINDI JÕEST PÄÄSTETUD NOOR VÕSAVILLEM"Tänane hommik tõi Eestimaa Loomakaitse Liidule kõne, mida juba iga päev ei…

Posted by Eestimaa Loomakaitse Liit on Thursday, 21 February 2019

Tags:    
Advertisement

Similar News