మెరుపుదాడుల్లో రారాజు... మిరాజ్

భారత విమానదళ ప్రధాన అస్త్రం మిరాజ్ పాక్ పై మిరాజ్ ఫైటర్లతో సర్జికల్ స్ట్రయిక్ 30 నిముషాల ఆపరేషన్ లో 12 మిరాజ్ ఫైటర్లు పుల్వామా ఉగ్రదాడికి…ప్రతిదాడితో భారత్ ప్రతీకారం తీర్చుకొంది. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా 12 మిరాజ్ ఫైటర్ యుద్ధవిమానాల దళంతో…పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై వందల కిలోల బాంబులతో దాడి చేసి… 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మిరాజ్ దళంతో దాడి…. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజుల్లోనే […]

Advertisement
Update:2019-02-26 11:14 IST
  • భారత విమానదళ ప్రధాన అస్త్రం మిరాజ్
  • పాక్ పై మిరాజ్ ఫైటర్లతో సర్జికల్ స్ట్రయిక్
  • 30 నిముషాల ఆపరేషన్ లో 12 మిరాజ్ ఫైటర్లు

పుల్వామా ఉగ్రదాడికి…ప్రతిదాడితో భారత్ ప్రతీకారం తీర్చుకొంది. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా 12 మిరాజ్ ఫైటర్ యుద్ధవిమానాల దళంతో…పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై వందల కిలోల బాంబులతో దాడి చేసి… 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

మిరాజ్ దళంతో దాడి….

పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజుల్లోనే భారత్…పన్నెండు యుద్ధ విమానాల దళంతో బదులు తీర్చుకొంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై…వెయ్యికిలోల బాంబులతో దాడి చేసి… 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

భారత వైమానికదళ అమ్ముల పొదిలోని …మిరాజ్ ఫైటర్ జెట్ విమానాలు …ఈ మెరుపుదాడిలో పాల్గొన్నాయి.

గ్వాలియర్, ఆగ్రాలోని వైమానికదళ కేంద్రాలలోని పన్నెండు మిరాజ్ విమానాలు…. కేవలం 30 నిముషాలలోనే…. సర్జికల్ స్ట్రయిక్స్-2ను విజయవంతంగా ముగించుకొని స్థావరాలకు తిరిగి వచ్చాయి.

పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో ప్రధానపాత్ర వహించిన మిరాజ్ ఫైటర్ జెట్ విమానాల గురించే …ఇప్పుడు దేశంలోని ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకొంటున్నారు. అందరి నోటా…. మిరాజ్ ఫైటర్ విమానాల మాటే వినిపిస్తోంది.

19 ఏళ్లుగా మిరాజ్ సేవ….

భారత వైమానికదళానికి గత 19 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మిరాజ్ విమానాల గురించే…ఇప్పుడు దేశంలోని అందరూ చర్చించుకొంటున్నారు. ఈ విమానాల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా….ఫైటర్ జెట్ విమానాలంటే… అమెరికా తయారీ F-14, F-16 లేదా రష్యన్ మేడ్ మిగ్ విమానాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే …అమెరికా, రష్యా తయారీ ఫైటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా…. ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ కంపెనీ తయారు చేసినవే మిరాజ్ -2000 బ్రాండ్ విమానాలు.

మల్టీరోల్ ఫైటర్ మిరాజ్….

మల్టీ రోల్ ఫైటర్లుగా గొప్ప పేరు, రికార్డు ఉన్న మిరాజ్ యుద్ధవిమానాలు…ప్రస్తుతం…ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా…ప్రపంచంలోని తొమ్మిది దేశాల విమానదళాలకు దన్నుగా నిలుస్తూ వస్తున్నాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన మిరాజ్ విమానాలను…భారత వైమానదళం 1980లోనే సమకూర్చుకొంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా వైమానికదళ స్థావరాలలో…. మిరాజ్ ల ప్రధాన కేంద్రంగా ఉంది.

ఒక్కో మిరాజ్ ధర 195 కోట్ల రూపాయలు…

స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో రూపొందించిన మిరాజ్… ఒక్కో ఫైటర్ ధర…195 కోట్ల రూపాయలు మాత్రమే. అంతేకాదు..సింగిల్ ఇంజన్ తో తయారు చేసిన ఈ సింగిల్ పైలట్ విమానం బరువు 7 వేల 500 కిలోలుగా ఉంది. గంటకు 2 వేల 530 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే శక్తి మిరాజ్ లకు మాత్రమే సొంతం.

అంతేకాదు.. మిరాజ్ కు…3 వేల 330 కిలోమీటర్ల దూరంలోని శత్రుస్థావరాలపైన దాడులు చేయటమే కాదు… లక్ష్యాలను సైతం ధ్వంసం చేసే బలం ఉంది. శత్రురాడార్ లకు చిక్కకుండా… సముద్రమట్టానికి 56 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేయగల సత్తా సైతం మిరాజ్ ఫైటర్లకు ఉంది.

ఫైటర్ జెట్ల కోసం లక్షల కోట్ల ఖర్చు….

ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక దళాలలో ఒకటిగా గుర్తింపు పొందిన భారత్ కు…పాకిస్థాన్, చైనా దేశాల నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉండడంతో…అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాల కోసం… ఏటా లక్షల కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరుపొందిన భారత వాయుసేనలో రష్యా తయారీ మిగ్ విమానాలతో పాటు… 51 మిరాజ్ విమానాలు సైతం ఉన్నాయి.

అప్ గ్రేడేషన్ కోసం 344 కోట్లు….

1980 దశకం నుంచి భారత వైమానిక దళ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా ఉన్న మిరాజ్ ఫైటర్ల టెక్నాలజీని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకొంటూ వస్తున్నారు. ఒక్కో ఫైటర్ ను ఆధునీకరించడానికి 344 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

భారత వైమానికదళంలోని మొత్తం.. 51 మిరాజ్ ఫైటర్లలో…కేవలం రెండింటిని మాత్రమే..ఇప్పటి వరకూ అప్ గ్రేడ్ చేయగలిగారు. మిగిలిన 49 ఫైటర్ల ఆధునీకరణ కోసం17వేల 547 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచారు.

మిగ్ ల స్థానంలో రాఫెల్ జెట్స్….

భారత వైమానికదళంలోని మిగ్ విమానాలు పాతబడిపోవడంతో….వాటికి బదులుగా …ఫ్రెంచ్ దసాల్ట్ తయారీ రాఫెల్ విమానాలను సమకూర్చుకోడానికి భారత్ ఇప్పటికే భారీకాంట్రాక్టు కుదుర్చుకొంది.

మిరాజ్ విమానాల అప్ గ్రేడేషన్ తో పాటు….రాఫెల్ జెట్ ఫైటర్లు అందుబాటులోకి వస్తే…భారత వైమానికదళం అత్యాధునిక హంగులతో అత్యంత బలోపేతం కాగలుగుతుంది.

ప్రతి మనిషికీ ఓ రోజు ఉంటుందన్నట్లుగానే…. భారత వైమానికదళానికి గత 19 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మిరాజ్ -2000 బ్రాండ్ ఫైటర్లకూ ఓ రోజు ఉందనటానికి…. సర్జికల్ స్ట్రయిక్స్ -2నే నిదర్శనం.

ఇప్పుడు అందరూ చర్చించుకొంటున్నది… పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పై ప్రతీకారంతో పాటు… భారత వైమానికదళం మెరుపుదాడులు, మిరాజ్ ఫైటర్ జెట్ల గురించి మాత్రమే.

Tags:    
Advertisement

Similar News