పాక్ పై భారత క్రీడాభిమానుల గరంగరం

పాక్ తో ప్రపంచకప్ మ్యాచ్ వద్దంటున్న అభిమానులు జూన్ 16న మాంచెస్టర్ వేదికగా పాక్ తో టీమిండియా మ్యాచ్ మే 30 నుంచి ఇంగ్లండ్, వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్ పుల్వామా ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్తాన్ పై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలు వద్దే వద్దని గట్టిగా చెబుతున్నారు. వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో ఆడాల్సిన మ్యాచ్ ను.. టీమిండియా బహిష్కరించాలంటూ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ […]

Advertisement
Update:2019-02-19 14:56 IST
  • పాక్ తో ప్రపంచకప్ మ్యాచ్ వద్దంటున్న అభిమానులు
  • జూన్ 16న మాంచెస్టర్ వేదికగా పాక్ తో టీమిండియా మ్యాచ్
  • మే 30 నుంచి ఇంగ్లండ్, వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్

పుల్వామా ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్తాన్ పై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలు వద్దే వద్దని గట్టిగా చెబుతున్నారు.

వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో ఆడాల్సిన మ్యాచ్ ను.. టీమిండియా బహిష్కరించాలంటూ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ డిమాండ్ చేస్తున్నాడు.

పాక్ పై భారత అభిమానుల గరంగరం….

పుల్వామా ఉగ్రదాడికి కారణమైన పాకిస్థాన్ పై…భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్ తో క్రీడాసంబంధాలు వద్దేవద్దని అంటున్నారు.

ఇప్పటికే…మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం, జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలోని పాక్ క్రికెటర్ల చిత్రాలను… ఆయా క్రికెట్ సంఘాలు తొలిగించడం ద్వారా… తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి.

ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణకు పిలుపు…

అంతేకాదు…దేశంలోని అత్యంత పురాతన క్రికెట్ క్లబ్ సీసీఐ సైతం… పాకిస్థాన్ తో వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. దేశంకంటే క్రీడలు ఏమంత గొప్పవి కావంటూ సీసీఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

దీనికితోడు…టీమిండియా మాజీ ఆల్ రౌండర్ హర్భజన్ సింగ్ సైతం… పాకిస్థాన్ తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడకపోయినా… ఫైనల్ చేరి… ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని గుర్తు చేశాడు.

పాక్ తో మ్యాచ్ వద్దే వద్దు….

భారత్ సహనానికి పదేపదే పరీక్ష పెడుతున్న పాక్ దుశ్చర్యలను ఇక సహించరాదంటూ హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిగా జరిగే ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భాగంగా…జూన్ 16న మాంచెస్టర్ లో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ తో టీమిండియా తలపడాల్సి ఉంది.

ఈమ్యాచ్ ను భారత్ బహిష్కరించినా…మిగిలిన మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా…ఫైనల్స్ చేరే అవకాశం ఉందని హర్భజన్ గుర్తు చేశాడు.

ప్రభుత్వం అనుమతిస్తేనే పాక్ తో పోటీ…

ఇదిలాఉంటే…ప్రభుత్వం అనుమతిస్తేనే….పాకిస్థాన్ తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని…ఐపీఎల్ బోర్డు చైర్మన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

ఏదిఏమైనా…. పుల్వామా ఉగ్రదాడి కారణంగా.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న భారత్, పాక్ క్రికెట్ సంబంధాలు… బాగుచేయటానికి వీలులేనంతగా పతనమయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News