ట్విట్టర్ సీఈవో ఇండియాకు రావల్సిందే...!

ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఇండియాకు వచ్చి తమ ఎదుట హాజరు కావాలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఫేస్ న్యూస్, ఇతర పార్టీ వ్యక్తులపై విద్వేషాలు వ్యాపింప చేసేలా ఉన్న అకౌంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయమని ట్విట్టర్‌ను కోరినా సానుకూలంగా స్పందించలేదు. ఈ విషయంపై వేసిన పార్లమెంటరీ కమిటీ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేను […]

Advertisement
Update:2019-02-11 15:27 IST

ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఇండియాకు వచ్చి తమ ఎదుట హాజరు కావాలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఫేస్ న్యూస్, ఇతర పార్టీ వ్యక్తులపై విద్వేషాలు వ్యాపింప చేసేలా ఉన్న అకౌంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయమని ట్విట్టర్‌ను కోరినా సానుకూలంగా స్పందించలేదు.

ఈ విషయంపై వేసిన పార్లమెంటరీ కమిటీ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేను ఫిబ్రవరి 7న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే అంత తక్కువ సమయంలో రాలేమని ట్విట్టర్ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ పార్లమెంటరీ కమిటీ ముందు ట్విట్టర్ ఇండియా హెడ్ మహిమా కౌల్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

మీతో మాట్లాడలేమని సీఈవోతో పాటు ఇతర అధికారులు రావల్సిందేనని కమిటీ తేల్చి చెప్పింది. అమెరికా నుంచి రావడానికి 15 రోజుల గడువు ఇస్తున్నామని.. అప్పటికీ హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిటీ పేర్కొంది.

ఈ నిర్ణయంతో ట్విట్టర్ ప్రతినిధులు ఆలోచనలో పడ్డారు. తమ వివరణ వినకుండా సీఈవోనే హాజరు కావాలని చెప్పడంతో వారు వెనుదిరిగారు.

Tags:    
Advertisement

Similar News