ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే.... పాములు ఏం చేస్తాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా పాములది ఒకదారైతే…. ఆస్ట్రేలియలోని పాములది మరో దారి. భూమికి దక్షిణాన ఉన్న ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అయితే వేసవిలో మాత్రం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో భూమిలో తేమ శాతం తగ్గిపోవడంతో పాములు పట్నంబాట పడతాయట. దానికి కారణం ఏంటో తెలుసా..? సాధారణంగా ఆస్ట్రేలియన్ స్నేక్స్ వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఇండ్ల వెనుక దొడ్లలో తిరుగుతుంటాయట.. అదే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతే వెంటనే ఇండ్లలోని చల్లని ప్రదేశాలను చూసుకుంటాయి. రిఫ్రిజిరేటర్ల కింద, బార్బెక్యూ గ్రిల్స్ […]

Advertisement
Update:2019-01-30 10:33 IST

ప్రపంచవ్యాప్తంగా పాములది ఒకదారైతే…. ఆస్ట్రేలియలోని పాములది మరో దారి. భూమికి దక్షిణాన ఉన్న ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అయితే వేసవిలో మాత్రం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో భూమిలో తేమ శాతం తగ్గిపోవడంతో పాములు పట్నంబాట పడతాయట. దానికి కారణం ఏంటో తెలుసా..?

సాధారణంగా ఆస్ట్రేలియన్ స్నేక్స్ వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఇండ్ల వెనుక దొడ్లలో తిరుగుతుంటాయట.. అదే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతే వెంటనే ఇండ్లలోని చల్లని ప్రదేశాలను చూసుకుంటాయి. రిఫ్రిజిరేటర్ల కింద, బార్బెక్యూ గ్రిల్స్ లోపల, తేమగా ఉండే గోడల పైన, ఏసీ మెషిన్లలో తలదాచుకుంటాయట. ఇవి అక్కడి స్థానికులకు తెలిసిన విషయమే కావడంతో వాళ్లు ఆయా కాలాల్లో ఆ వస్తువుల దగ్గరకు వెళ్లే ముందు ఒక సారి చెక్ చేసుకుంటారట.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అడిలైడ్ వంటి నగరాల్లో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీంతో పాములు పలు ప్రాంతాల్లో బాత్ రూమ్స్, ఏసీ మెషిన్లలోకి చేరిపోయాయి.

అక్కడ పాములు పట్టడంలో నిష్ణాతుడైన లూక్ హంట్లీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో పాములను పట్టేశాడు. పాములు తమ శరీరానికి అవసరమైన నీటిని చర్మం ద్వారా గ్రహిస్తాయి కాబట్టే అలాంటి ప్రదేశాల్లో దూరిపోతాయని ఆయన చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News