మీ ఆవిడ పదివేలు దొబ్బింది.... ఓటు వేయకపోతే ఊరుకోవద్దు.... ఏం రా....

మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి తన శైలిని ప్రదర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అదిరించి, బెదిరించి అయినా సరే ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంక్షేమ పథకాలకు తన సొంత డబ్బును ఖర్చు పెట్టినట్టుగా మంత్రి  ఫీలై పోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అక్కడి వారితో మాట్లాడిన అచ్చెన్నాయుడు… అన్నీ దొబ్బి ఓట్లు వేయకపోతే ఊరుకోవద్దని కార్యకర్తలకు నూరిపోశారు. ”ఏం రా…. మీ ఆవిడ పదివేలు దొబ్బింది. రుణమాఫీ వస్తే […]

Advertisement
Update:2019-01-29 05:29 IST

మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి తన శైలిని ప్రదర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అదిరించి, బెదిరించి అయినా సరే ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంక్షేమ పథకాలకు తన సొంత డబ్బును ఖర్చు పెట్టినట్టుగా మంత్రి ఫీలై పోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అక్కడి వారితో మాట్లాడిన అచ్చెన్నాయుడు… అన్నీ దొబ్బి ఓట్లు వేయకపోతే ఊరుకోవద్దని కార్యకర్తలకు నూరిపోశారు.

”ఏం రా…. మీ ఆవిడ పదివేలు దొబ్బింది. రుణమాఫీ వస్తే దొబ్బారు. ఇవన్నీ దొబ్బి.. ఓటు వేయకపోతే ఊరుకోవద్దు” అంటూ ఒక వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి ఇచ్చిన స్వీట్ వార్నింగ్‌కు టీడీపీ కార్యకర్తలు పగలబడి నవ్వారు.

అయితే ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలను చూపి తమకు ఓటు వేయాల్సిందేనని మంత్రి డిమాండ్ చేయడం, అలా వేయకపోతే ఊరుకోవద్దని కార్యకర్తలను ఉసిగొల్పడం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News