బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏమిటో అర్థం కావడం లేదు
ఈ బట్టలూడదీసే ఫాంటసీ కొత్తగా వింటున్నాం. బట్టలు ఊడదీసి ఏం చూద్దాం అనుకుంటున్నావని ప్రశ్నించిన ఏలేటి;
రేవంత్ రెడ్డికి బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏమిటో అర్థం కావడం లేదు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న సీఎం అసెంబబ్లీలో మాట్లాడిన అనేక అంశాలపై ఆయన స్పందిస్తూ మాట్లాడితే బట్టలూడదీస్తా.. ప్రతిపక్షాల బట్టలూడదీస్తా.. జర్నలిస్టుల బట్టలూడదీస్తా అన్నారు. అయ్యా నీ బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదన్నారు. ఈ బట్టలూడదీసుడేందో? ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడంగా మేము చూడలేదన్నారు. ఈ బట్టలూడదీసే ఫాంటసీ కొత్తగా వింటున్నాం.బట్టలు ఊడదీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు అని ప్రశ్నించారు. బట్టలు ఊడదీసి ఏం చేయాలనుకుంటున్నావో మాకు అర్దం కావడం లేదు.దయచేసి మీ భాష కూడా చట్టసభల్లో మాట్లాడే ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని ఏలేటి సలహా ఇచ్చారు.
రేవంత్ ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేత ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం. రేవంత్ కాలేజీ రోజుల్లో ఇలాంటి ఏకపాత్రాభినం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే ఎక్కడా సమాధానం చెప్పకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినయం మాత్రమే రేవంత్ చేశారు.
శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో... ఆ గ్యారెంటీలకే చట్టబద్ధత లేకుండాపోయింది. సభ ఇంకా కొసాగుతున్నది. ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా? తెలంగాణ ప్రజలు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉన్నది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా? అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తి చేశామని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.