తన అంతరిక్ష అనుభవాల గురించి సునీతా విలియమ్స్‌ ఏమన్నారంటే?

ఇక్కడ నా సుదీర్ఘ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను అన్న భారత సంతతి వ్యోమగామి;

Advertisement
Update:2025-03-16 20:20 IST

అంతరిక్షంలో చిక్కుకుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదికి రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. నేను, బుచ్‌ విల్మోర్ ఒక మిసన్‌ను కంప్లీట్‌ చేసే క్రమంలో అంతరిక్షంలోకి అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒకరికొకరు సమన్వయంతో, సహకారంతో పనిచేశాం. మేము ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్ఘ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను అని సునీతా విలియమ్స్‌ అన్నారు.

సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలుకు పైగానే అయ్యింది. 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్నది. కానీ సాంకేతిక కారణాలతో రాలేదు. భూకక్ష్యకు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎన్‌ఎస్‌). సునీతను, ఆమె సహ వ్యోమగామి బుల్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన 'బోయింగ్‌ స్టార్‌లైనర్‌' వ్యోమనౌక వారికి అక్కడి దింపేశాక, పనిచేయడం మానేసింది. దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.

Tags:    
Advertisement

Similar News