లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ 412.85 పాయింట్ల లాభంతో 74241.76 వద్ద.. నిఫ్టీ 157.65 పాయింట్లు పెరిగి 22554.85 వద్ద ఉన్నాయి.;

Advertisement
Update:2025-03-17 10:07 IST
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు
  • whatsapp icon

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య నేటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ 412.85 పాయింట్ల లాభంతో 74241.76 వద్ద.. నిఫ్టీ 157.65 పాయింట్లు పెరిగి 22554.85 వద్ద ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.80 వద్ద కొనసాగుతున్నది.

నిఫ్టీ సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బీపీసీఎల్, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, హీరో మోటోకార్ప్‌ స్టాక్స్‌ నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను లాభాలతో ముగించిన ప్రభావం మన సూచీలపై కనిపిస్తున్నది. ఇండస్‌ ఇండ్‌ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆర్‌బీఐ వెల్లడించిన విషయం విదితమే. దీంతో ప్రస్తుతం ఆ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి

Tags:    
Advertisement

Similar News