తుమ్మలతో తోటలో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణలో టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరూ కూడా ఖమ్మం జిల్లా నుంచే విజయం సాధించారు. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చ నాగేశ్వరరావు టీడీపీ తరపున గెలిచారు. ఎన్నికలు ముగిసిన వెంటనే వీరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం సాగినా వారు ఖండించారు. ఇప్పుడు మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు… ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో ఒక […]
తెలంగాణలో టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరూ కూడా ఖమ్మం జిల్లా నుంచే విజయం సాధించారు.
సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చ నాగేశ్వరరావు టీడీపీ తరపున గెలిచారు. ఎన్నికలు ముగిసిన వెంటనే వీరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం సాగినా వారు ఖండించారు. ఇప్పుడు మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు… ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో ఒక తోటలో భేటీ అయ్యారు.
తన సొంతూరుకు సమీపంలోని లింగాయపాలెం వద్ద ఒక తోటలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో తుమ్మల చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ లోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితి లేదని, తెలంగాణలో అయితే ఇక భవిష్యత్తులో టీడీపీ ఉనికే ఉండదని…. కాబట్టి ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లోకి వస్తే మంచి అవకాశాలుంటాయని వివరించారు. వారు కూడా దీనికి సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది.
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి తీసుకురాగలిగితే పార్టీలో తన పరపతి పెరుగుతుందని తమ్మల నాగేశ్వరరావు భావిస్తున్నారు. తద్వారా మరోసారి ఎమ్మెల్సీగానైనా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు.