ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్‌ జస్టిస్ నియామకం

ఉమ్మడి హైకోర్టును విభజించిన కేంద్ర ప్రభుత్వం… జనవరి ఒకటి నుంచి ఏపీకి, తెలంగాణకు హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తాయని చెప్పింది. తెలంగాణ హైకోర్టుకు 10 మంది, ఏపీ హైకోర్టుకు 16మంది న్యాయమూర్తులను కేటాయించింది. తాజాగా ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి పేరును కూడా ప్రకటించింది. ఏపీ హైకోర్టుకు చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను చీఫ్‌ జస్టిస్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్‌ కుమార్ వ్యవహరించనున్నారు. జనవరి […]

Advertisement
Update:2018-12-27 12:27 IST

ఉమ్మడి హైకోర్టును విభజించిన కేంద్ర ప్రభుత్వం… జనవరి ఒకటి నుంచి ఏపీకి, తెలంగాణకు హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తాయని చెప్పింది.

తెలంగాణ హైకోర్టుకు 10 మంది, ఏపీ హైకోర్టుకు 16మంది న్యాయమూర్తులను కేటాయించింది. తాజాగా ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి పేరును కూడా ప్రకటించింది.

ఏపీ హైకోర్టుకు చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను చీఫ్‌ జస్టిస్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్‌ కుమార్ వ్యవహరించనున్నారు.

జనవరి ఒకటిన ప్రవీణ్‌ కుమార్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఏపీ హైకోర్టుకు కేటాయించిన 16 మంది న్యాయమూర్తుల్లో చాగరి ప్రవీణ్‌ కుమార్ కూడా ఒకరు.

Tags:    
Advertisement

Similar News