కాంగ్రెస్‌ అప్పులపై నేను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్ధం

భూములు కుదువపెట్టి అప్పులు తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని హరీశ్‌ విమర్శ

Advertisement
Update:2024-12-19 16:31 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి సంవత్సరమే రూ. 1.25 లక్షల కోట్ల అప్పులు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు. రాష్ట్ర రుణాలపై శాసనసభలో జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు.

భూములు కుదువపెట్టి అప్పులు తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా మెస్‌ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ యంత్ర పరికరాలకు రాయితీ నిధులు ఇచ్చామని తెలిపారు. మేం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేస్తే.. వీళ్ల అప్పు ఐదేళ్లలోనే రూ. 7 లక్షల కోట్లు దాటిపోతుంది. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే.. మేం కూడా మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్నే అప్పగించాం. రూ. 2.93 లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించాం. రాష్ట్ర సొంత ఆదాయం రూ. 35 వేల కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు పెంచామన్నారు. కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందన్నారు. ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడిందని హరీశ్‌రావు వివరించారు. 

Tags:    
Advertisement

Similar News