ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ టెండర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మంత్రివర్గంలో చర్చించి సిట్ ఎంక్వైరీపై విధివిధానాలు రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వం 30 ఏళ్లకు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ వసూళ్లను తెగనమ్మిందని అన్నారు. హరీశ్ రావు, ప్రతిపక్షం కోరినందునే సిట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తన వ్యాఖ్యలను సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదే పదే ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై ఆరోపణలు చేసినందునే తాను ఆ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరారని హరీశ్ రావు అన్నారు.
Advertisement