హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 37వ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది.

Advertisement
Update:2024-12-19 17:55 IST

పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో 37వ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో డిసెంబర్‌ 19 నుంచి 29వ తేదీ వరకు ఈ 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ను నిర్వహిస్తున్నామనిహెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు డా.యాకూబ్‌ షేక్‌ తెలిపారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు కానున్నాయి. వీటిలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు వారి పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా అన్ని భాషల్లోని క్లాసిక్ పుస్తకాలతో పాటు ఇటీవల విడుదలై మంచి గుర్తింపు సాధించిన పుస్తకాలు సైతం అందుబాటులో ఉంటాయి.

దాంతో.. దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలున్న రచయితలతో పాటు కొత్తగా రచనలు ప్రారంభించిన రచయితల పుస్తకాలను ఒకేచోట లభిస్తుండడంతో పుస్తకాభిమానలకు ఇదో చక్కని వేదికలా ఉపయోగపడుతోంది. వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని తెలిపారు. బుక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బుక్ ఫెయిర్‌.. ఒక‌టి, రెండు కాదు ఏకంగా 11 రోజుల పాటు కొనసాగుతుంద‌న్నారు. సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్‌లో పాల్గొన‌వ‌చ్చన్నారు. ఈ ఏడాది తొలిసారిగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని యాకూబ్ షేక్‌ అన్నారు. 

Tags:    
Advertisement

Similar News