వాట్సప్‌లోనే చాట్‌జీపీటీ
అకౌంట్ అవసరం లేకుండా ఎలా వాడుకోవాలంటే?
మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్‌ఏఐ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. '12 డేస్ ఆఫ్ ఓఎన్‌ఏఐ' అనౌన్స్‌మెంట్‌లో భాగంగా తన ఏఐ చాట్ చాట్‌బాట్ చాట్‌జీపీటీని వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్, అకౌంట్‌తో పనిలేకుండా నేరుగా వాట్సప్‌లోనే చాట్‌జీపీటీని ఉపయోగించవచ్చు.
ఈ సేవలను వరల్డ్‌వైడ్‌గా ఓపెన్‌ఏఐ అందుబాటులోకి తెచ్చింది. +1800 242 8478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్ చేయవచ్చు. మనం అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ జవాబులు ఇస్తుంది. ఇండియాలోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇదే నంబర్‌కు కాల్ చేసి కూడా చాట్‌జీపీటీ సేవలు పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికా, కెనడాలకు మాత్రమే పరిమితం.
ప్రస్తుతం చాట్‌జీపీటీ సేవలు పొందాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సప్‌లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. అయితే, రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. పరిమితి దగ్గర పడ్డాక నోటిఫికేషన్ ద్వారా ఆ సమాచారం అందుతుంది. భవిష్యత్తులో చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమెరీ లాగ్స్ వంటి సౌకర్యాలు రానున్నాయి. మెటా సంస్థ కూడా వాట్సప్‌లో ఏఐ చాట్ చాట్‌బాట్ సేవలను అందిస్తున్నది. దానికి పోటీగా చాట్‌జీపీటీని మరింతమందికి చేరువ చేయడానికి వాట్సప్ లో సేవలకు ఓపెన్‌ఏఐ శ్రీకారం చుట్టింది.