లోకేశ్ నన్ను ఇంట్లో హిట్లర్ అని పిలుస్తారు : భువనేశ్వరి
లోకేశ్ తనను హిట్లర్ అని పిలుస్తారని భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి లోకేశ్ తనను హిట్లర్ అని పిలుస్తారని ఆయన తల్లి నారా భువనేశ్వరి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్ధులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్బంగా తన ఇంట్లో విషయాలను విద్యార్థులను అడగారు. ఈ సందర్భంగా తన ఇంట్లో విషయాలను విద్యార్థులను అడగారు. దీనికి ఆమె నవ్వులు పూయిస్తూ సమాధానం చెప్పారు. నారా లోకేశ్‌ను తాను చాలా పద్ధతిగా పెంచానని, అందుకే తనను హిట్లర్ అని పిలిచేవాడని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అసలు టైమ్ ఇవ్వరని తెలిపారు. తాను కూడా ఆయనను డిస్టర్బ్ చేయననని చెప్పారు. ప్రతి భార్య కూడా తమ భర్తకు అండగా నిలబడాలని సూచించారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని.. కష్టపడితే విజయం సొంతమవుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులను చూస్తుంటే తనకు కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయని భువనేశ్వరి అన్నారు. ‘నేనూ మీలాగే సరదాగా గడిపాను.
కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటున్న సమయంలో 19 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశాను. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థానాలకు వెళ్లాలన్నారు. అందరు బాలయ్యను తన తమ్ముడు అనుకుంటారని, కానీ ఆయన తన అన్న అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తనకు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టమని చెప్పారు. మూవీస్ చాలా తక్కువగా చూస్తానని...దర్శకులు గురించి కూడా తనకు పెద్దగా తెలియదని భువనేశ్వరి పేర్కొన్నారు. అంతకుముందు శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని భువనేశ్వరి పరిశీలించారు.