కాంగ్రెస్‌ అదానీపై పోరాటం చేస్తున్నదా? లేదా ప్రజలను మోసం చేస్తున్నదా?

కాంగ్రెస్‌ అగ్రనేతకు రాహుల్‌గాంధీకి లేఖ రాసిన కేటీఆర్‌

Advertisement
Update:2024-12-19 15:40 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖ రాశారు. అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌.. అదానీపై పోరాటం చేస్తున్నదా? లేక ప్రజలను మోసం చేస్తున్నదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో అదానీతో పోరాటం అంటూ తెలంగాణ ప్రభుత్వం దోస్తీ చేస్తున్నదని కేటీఆర్‌ ఆరోపించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్‌ను కేటీఆర్‌ కోరారు. లావోస్‌ వేదికగా అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నారని గుర్తుచేశారు. స్కిల్‌ వర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం తీసుకున్నారని, ఇది వారి క్విడ్‌ ప్రోకో గా ఉందని, దీనిపై బీఆర్‌ఎస్‌ నిలదీయడంతో చెక్కు రిటర్న్‌ చేశారని గుర్తుచేశారు. మంత్రి పొంగులేటి కూడా అదానీ ప్రతినిధులతో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లపై భేటీ అయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అదానీ పట్ల కాంగ్రెస్‌ వైఖరి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ, వారి కార్పొరేట్‌ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీనిపై మీరు తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వాలని కేటీఆర్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. 



Tags:    
Advertisement

Similar News