సౌతాఫ్రికా వైట్ లైట్నింగ్ సరికొత్త రికార్డు

422 టెస్ట్ వికెట్ల డేల్ స్టెయిన్ షాన్ పొలాక్ రికార్డును తెరమరుగు చేసిన స్టెయిన్ సఫారీ వైట్ లైట్నింగ్ డేల్ స్టెయిన్ 422 టెస్ట్ వికెట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. షాన్ పొలాక్ పేరుతో ఉన్న 421 వికెట్ల రికార్డును ఎట్టకేలకు అధిగమించాడు. సౌతాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా పాకిస్థాన్ తో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజు ఆటలో పాక్ ఓపెనర్ ఫకుర్ జమాన్ ను అవుట్ చేయడం ద్వారా ఈఘనత సొంతం చేసుకొన్నాడు. ఒకే ఒక్కడు…. గాయం కారణంగా […]

Advertisement
Update:2018-12-26 13:45 IST
  • 422 టెస్ట్ వికెట్ల డేల్ స్టెయిన్
  • షాన్ పొలాక్ రికార్డును తెరమరుగు చేసిన స్టెయిన్

సఫారీ వైట్ లైట్నింగ్ డేల్ స్టెయిన్ 422 టెస్ట్ వికెట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. షాన్ పొలాక్ పేరుతో ఉన్న 421 వికెట్ల రికార్డును ఎట్టకేలకు అధిగమించాడు. సౌతాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా పాకిస్థాన్ తో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజు ఆటలో పాక్ ఓపెనర్ ఫకుర్ జమాన్ ను అవుట్ చేయడం ద్వారా ఈఘనత సొంతం చేసుకొన్నాడు.

ఒకే ఒక్కడు….

గాయం కారణంగా సఫారీ టీమ్ ఆడిన గత 27 టెస్టులకు దూరమైన 35 ఏళ్ల స్టెయిన్ ..పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి సౌతాఫ్రికా జట్టులో చోటు సంపాదించాడు.

గంటకు 150 కిలోమీటర్ల సగటు వేగంతో బౌల్ చేయటానికి పెట్టింది పేరైన స్టెయిన్…. అవుట్ స్వింగర్లు వేయటంలో మొనగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

నాన్ స్టాప్ గా 48 టెస్టులు….

2009 నుంచి 2015 మధ్యకాలంలో… ఏవిధమైన విరామం లేకుండా ఆడిన 48 టెస్టుల్లో 232 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు… 263 వారాలపాటు టెస్ట్ క్రికెట్ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.

80 టెస్టుల్లోనే 400 వికెట్లు….

2015 సీజన్లో తన 80వ టెస్ట్ మ్యాచ్ ఆడిన స్టెయిన్ 400 వికెట్ల మైలురాయిని సైతం చేరాడు. ఆ తర్వాత భుజం గాయం, తొడ కండరం గాయాలతో ఆటకు దూరమయ్యాడు.

తన కెరియర్ లో 26సార్లు ఓ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల రికార్డుతో పాటు…ఐదుసార్లు 10 వికెట్ల ఘనత సంపాదించాడు. టెస్ట్ హోదా పొందిన అన్ని దేశాల జట్లపైనా స్టెయిన్ 5 వికెట్ల రికార్డు సాధించడం విశేషం.

Tags:    
Advertisement

Similar News