పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు కైఫ్ దిమ్మతిరిగే కౌంటర్

భారత దేశాన్ని చులకన చేస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ వికెట్‌ కీపర్ మహ్మద్‌ కైఫ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్‌ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. దేశంలో మైనార్టీలను ఎలా చూసుకోవాలో భారత్‌కు తాము నేర్పిస్తామన్న వ్యాఖ్యలపై ఇప్పటికే ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా తీవ్రంగా స్పందించారు. మీ దేశంలో ఒక మైనార్జీ వ్యక్తిని అధ్యక్షుడిని చేయగలవా? అని ఇమ్రాన్‌ను ఓవైసీ ప్రశ్నించారు. ఇప్పుడు మహ్మద్ కైఫ్‌ కూడా […]

Advertisement
Update:2018-12-25 10:54 IST

భారత దేశాన్ని చులకన చేస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ వికెట్‌ కీపర్ మహ్మద్‌ కైఫ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్‌ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

దేశంలో మైనార్టీలను ఎలా చూసుకోవాలో భారత్‌కు తాము నేర్పిస్తామన్న వ్యాఖ్యలపై ఇప్పటికే ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా తీవ్రంగా స్పందించారు. మీ దేశంలో ఒక మైనార్జీ వ్యక్తిని అధ్యక్షుడిని చేయగలవా? అని ఇమ్రాన్‌ను ఓవైసీ ప్రశ్నించారు. ఇప్పుడు మహ్మద్ కైఫ్‌ కూడా ట్విట్టర్లో స్పందించారు.

భారత్‌, పాక్‌ విడిపోయే సమయానికి పాకిస్తాన్‌లో 20 శాతం మంది మైనార్టీలు (పాక్‌లో మైనార్టీలుగా హిందువులు, సిక్కులు ఇతర మతస్తులు ఉన్నారు) ఉండేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ మైనార్టీల సంఖ్య పాకిస్తాన్‌లో రెండు శాతానికి పడిపోయిందని దీనికి ఏమంటారు? అని ఇమ్రాన్‌ ఖాన్‌ను కైఫ్ ప్రశ్నించారు.

పరోక్షంగా పాకిస్తాన్‌లో మైనార్టీ జాతులు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. అదే భారత దేశంలో మైనార్టీల సంఖ్య కూడా పెరుగుతోందని కైఫ్ పోల్చి చెప్పారు. మైనార్టీల విషయంలో ఉపన్యాసాలు ఇవ్వాల్సి వస్తే అందులో పాకిస్తాన్‌ చిట్టచివరి దేశంగా ఉంటుందని కైఫ్ ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News