నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు పాక్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 25 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.అల్ అజిజియా మీల్స్ అవినీతి కేసులో నవాజ్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. కొన్ని నెలల క్రితం అవెన్‌ ఫీల్డ్‌ కేసులో నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తెకు కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసు నుంచి సెప్టెంబర్‌లో ఇస్లామాబాద్ హైకోర్టు […]

Advertisement
Update:2018-12-24 10:42 IST

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు పాక్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 25 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.అల్ అజిజియా మీల్స్ అవినీతి కేసులో నవాజ్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.

కొన్ని నెలల క్రితం అవెన్‌ ఫీల్డ్‌ కేసులో నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తెకు కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసు నుంచి సెప్టెంబర్‌లో ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఆయన బయటపడ్డారు. ఇంతలోనే అల్‌ అజిజియా మీల్స్‌ అవినీతి కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

Tags:    
Advertisement

Similar News