టీడీపీ వైపు కొణతాల.... వైసీపీ, జనసేన గురించి ఎమన్నారంటే....
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉండడంతో తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని… ఇక తాను రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొణతాల వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. అదే సమయంలో ఏ పార్టీలో చేరుతారన్న దానిపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఏకం […]
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉండడంతో తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు.
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని… ఇక తాను రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొణతాల వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. అదే సమయంలో ఏ
పార్టీలో చేరుతారన్న దానిపై కొన్ని సంకేతాలు ఇచ్చారు.
ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం లేదని కాబట్టి అది టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్నారు. టీడీపీకి కాంగ్రెస్ రూపంలో ఒక మిత్రపక్షం కూడా దొరికిందని ఇది కూడా చంద్రబాబుకు కలిసి వచ్చే అంశమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం బీజేపీ తెర వెనుక ఉండి వైసీపీ, జనసేన మధ్య పొత్తు కుదిర్చినా ఆశ్చర్యం లేదన్నారు .
రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ రానురాను పడిపోతోందని కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని… బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు చొరవ అభినందనీయమని కొణతాల ప్రశంసించారు.