లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.... ఇవి తప్పనిసరి!

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. మన శరీరంలో చర్మం తర్వాత రెండవ అతి పెద్ద అవయవం కాలెయమే. శరీరంలో ఉండే ప్రతి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ సరిగ్గా పనిచేయాలి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే లివర్ ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అంతేకాదు రక్తంలోని మలినాలను తొలగించడంతోపాటు…ఇన్సులిన్ లెవల్స్ తగ్గించడం, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించడంలో లివర్ మెయిన్ రోల్ పోషిస్తుంది. అయితే లివర్ సరిగ్గా పనిచేయకుంటే….ఈ పనులన్నింటికి ఆటంకాలు ఏర్పడటంతోపాటు… […]

Advertisement
Update:2018-12-18 03:47 IST

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. మన శరీరంలో చర్మం తర్వాత రెండవ అతి పెద్ద అవయవం కాలెయమే. శరీరంలో ఉండే ప్రతి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ సరిగ్గా పనిచేయాలి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే లివర్ ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది.

అంతేకాదు రక్తంలోని మలినాలను తొలగించడంతోపాటు…ఇన్సులిన్ లెవల్స్ తగ్గించడం, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించడంలో లివర్ మెయిన్ రోల్ పోషిస్తుంది. అయితే లివర్ సరిగ్గా పనిచేయకుంటే….ఈ పనులన్నింటికి ఆటంకాలు ఏర్పడటంతోపాటు… అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతిఒక్కరూ లివర్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

1. లివర్ ను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి ముఖ్య భూమిక పోషిస్తుంది. లివర్ లోని ఎంజైమ్స్ ను ఉత్సాహపరుస్తుంది. వ్యర్థాలను బయటకు పంపించడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. ప్రతిరోజు రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

2. బీట్ రూట్. ఇందులో ఫ్లేవనాయిడ్స్ , బీటా కెరోటిన్ ఎక్కువ శాతం ఉంటాయి. వీటి వల్లే లివర్ లో ఉండే వ్యర్ధాలన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి. బీట్ రూట్ జ్యూస్ కానీ, బీట్ రూట్ ను తినడం అలావాటు చేసుకోండి.

3. నిమ్మకాయ. ఇందులో సి విటమిన్ ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో…లివర్ లోని వ్యర్థపదార్థాలను బయటకు పంపుతాయి.

4. గ్రీన్ టీ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఉండే టాక్సిన్స్ తోపాటు కొవ్వుకు కారణమయ్యే కారకాలను బయటకు పంపండంలో సహాయపడుతుంది. లివర్ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టాలంటే నిత్యం గ్రీన్ టీ తీసుకోవల్సిందే.

5. పసుపు. శరీరంలోని కొవ్వును సులభంగా జీర్ణమవడానికి పసుపు సహాయపడుతుంది. అంతేకాదు పాడైన లివర్ కణాలను మళ్లీ ఉత్పత్తి చేయడంలో పసుపు కీలకంగా వ్యవహరిస్తుంది. ఒక గ్లాసు నీటిలో పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. కొన్ని వారాల పాటు ప్రతిరోజు ఈ నీటిని తీసుకున్నట్లయితే… లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

6. ద్రాక్ష, నారింజ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

7.ఒక గ్లాస్ వాటర్ లో కొన్ని ధనియాలు నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే లివర్ లో ఉండే వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి.

పైన చెప్పినవే కాకుండా… తాజా కూరగాయలు, డ్రైఫ్రూట్స్, యాపిల్ జ్యూస్ , ఆకు కూరలు తీసుకున్నట్లయితే…. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News